Advertisement
Google Ads BL

ఈ చిత్రంతోనైనా ఏఎన్నార్ కోరిక తీర్చుతాడా?


అక్కినేని ఫ్యామిలీలో నటుడు సుమంత్‌ పుట్టాడు. ఇక హీరోగా మారిన తర్వాత 'ప్రేమకథ, యువకుడు, గౌరీ, సత్యం, గోదావరి' వంటి సినిమాలతో ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇక నాగార్జున సైతం సుమంత్‌కి అండగా నిలిచేందుకు ఆయనతో కలిసి మరీ ఓ తమిళ హిట్‌మూవీ రీమేక్‌ని సూపర్‌గుడ్‌ ఫిల్మ్‌బేనర్‌లో 'స్నేహమంటే..ఇదేరా' చేశాడు. కానీ ఆ చిత్రం కోసం నాగ్‌ ఎంతో త్యాగం చేసి 'త్యాగమంటే... ఇదేరా' అనిపించినా కూడా హిట్‌ రాలేదు. సుమంత్‌కి చిన్ననాడే తల్లి మరణించడంతో ఏయన్నార్‌ ఎప్పుడు.. వాడు తల్లి లేని బిడ్డ. నాకు నాగ్‌ కంటే సుమంతే ఇష్టం. వాడిని హీరోగా నిలబెట్టాలని చెప్పేవాడు. ఇక సుమంత్‌ కూడా ఇప్పటికే విసిగిపోయాను.. నాకు మూడు నాలుగు తరాలు ఇంట్లో కూర్చుని తిన్నా కరిగిపోని ఆస్థి ఉందని బరస్ట్‌ అయ్యాడు. ఇక ఆయన ఆ తర్వాత 'ఏమో..గుర్రంఎగరావచ్చు' అన్నాడు. ఆ గుర్రం ఎగరలేకపోయింది. తర్వాత బాలీవుడ్‌ 'విక్కీడోనర్‌'ని 'నరుడా..డోనరుడా' అని తీసినా ఏ నరుడు ఆ చిత్రం చూడలేదు. 

Advertisement
CJ Advs

ఇక ప్రస్తుతం ఆయన 'మళ్లీ రావా' అనే చిత్రంతో ఈ నెల 8న ప్రేక్షకుల మీదకు దండయాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రం తనకు నచ్చిన లవ్‌ మూవీ అని నాగచైతన్య ప్రమోట్‌ చేస్తుంటే, అక్కినేని కొత్త కోడలు సమంత కూడా సుమంత్‌ అన్నయ్య సినిమాని చూడమంటూ అక్కినేని ఫ్యామిలీ అభిమానులకు రిక్వెస్ట్‌ చేస్తున్నారు. మంచినటన, అందం ఉన్నా సుమంత్‌ ఎందుకు హీరోగా క్లిక్‌కావడం లేదో అనేది అందరి అనుమానం. ఇక నేడు ఏయన్నార్‌ బతికిలేడు కాబట్టి ఈ చిత్రంతోనైనా సుమంత్‌ హిట్‌ కొడితే ఏయన్నార్‌ కోరిక నెరవేరినట్టు అవుతుంది. ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్న గుసగుసలు ఏమంటే ఏయన్నార్‌ మరణం తర్వాత సుమంత్‌ని నాగ్‌ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని వినిపిస్తోంది. మరి ఈ చిత్రం ప్రమోషన్‌ విషయంలో మాత్రం చైతు, సామ్‌లతో పాటు నాగ్‌, అఖిల్ కూడా చేరి ప్రమోట్ చేశారు. ఇక రిజల్ట్ కోసమే వెయిటింగ్.. 

Hero Sumanth Malli Raava Movie Ready to Release:

Akkineni Family Pramotes Malli Raava Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs