Advertisement
Google Ads BL

పోస్టర్ అదిరింది.. సినిమా ఎలా ఉంటుందో..?


ఒక కళాఖండాన్ని, క్లాసిక్‌ని రీమేక్‌ చేయడం ఎంత కష్టమో రామ్‌చరణ్‌కి బాగా తెలుసు. ఆయన చేసిన 'జంజీర్‌' చిత్రం 'తుఫాన్‌'లో కొట్టుకుపోయింది. ఇక సినిమాలనే కాదు.. క్లాసిక్‌ టైటిల్స్‌ని పెట్టుకుంటే కూడా ఏదైనా తేడా వస్తే అంతే సంగతులు అన్న విషయం వేణుమాధవ్‌, కోనవెంకట్‌ వంటి వారికి బాగా తెలుసు. వేణుమాధవ్‌ తానే నిర్మాతగా 'భూకైలాస్‌, ప్రేమాభిషేకం' టైటిల్స్‌తో చేసిన చిత్రాలు ఆ విషయాన్ని నిరూపించాయి. ఇక కోనవెంకట్‌కి 'గీతాంజలి' ఫర్వాలేదనిపించినా 'శంకరాభరణం'తో -- తీరిపోయింది. ఇప్పుడు అదే రిజల్ట్‌ మరోసారి కొత్త సినిమా విషయంలో కూడా జరుగుతుందేమో అని కొందరు కాస్త సందేహంగానే ఉన్నారు. 

Advertisement
CJ Advs

పవన్‌కళ్యాణ్‌ నటించిన ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ లవ్‌స్టోరీ 'తొలి ప్రేమ' టైటిల్‌తో మెగా హీరో వరుణ్‌తేజ్‌ వస్తున్నాడు. ఇందులో వరుణ్‌తేజ్‌ హీరోగా, రాఖిఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాణంలోఈచిత్రం తెరకెక్కుతోంది. 'తొలిప్రేమ' పేరు వింటేనే అదొక మధురమైన అనుభూతి కలుగుతుంది. ఈ విషయంలో టైటిల్‌ డిజైన్‌, కలర్‌ఫుల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ద్వారా ఓకే అనిపించారు. 

ఇక నాటి 'తొలిప్రేమ'కి దేవా అందించిన పాటలు ఇన్నేళ్లయినా ఇప్పటికీ ఆహ్లాదంగా, నిత్యనూతనంగా ఉంటాయి. కాగా ఈ కొత్త 'తొలిప్రేమ'కి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.  కాగా ఈ చిత్రం కోసం తమన్‌ ఎలాంటి సంగీతం అందించాడు? బీజీఎం సంగతి ఏంటి? ట్యూన్స్‌ ఎలా ఉంటాయి? అనే విషయాలు మాత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమన్‌ మాత్రం తాను ఎంతో బాగా ఆల్బమ్‌ని ఇచ్చానని, ఇది ఖచ్చితంగా సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ అవుతోందని అంటున్నాడు. మరి ఈ పాటలు ఎలా ఉండనున్నాయి? అనేది త్వరలోనే తెలిసిపోనుండగా సినిమా ఎలా ఉంటుందో ఫిబ్రవరి 9న మాత్రమే చెప్పగలం...! 

Varun Tej Tholiprema First Look Released:

Varun Tej Movie With Pawan Kalyan Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs