Advertisement
Google Ads BL

'జై సింహా' ఆడియో ఎక్కడో తెలుసా?


బాలకృష్ణ ఈ మధ్యన తన ఆడియో వేడుకల్ని వెరైటీగా వేరే ప్రదేశాల్లో నిర్వహిస్తున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణిని తిరుపతిలో నిర్వహించగా.. మొన్నటికి మొన్న పైసా వసూల్ ఆడియో వేడుకని ఖమ్మం లో నిర్వహించాడు. ఇక ఇప్పుడు తన 102  మూవీ 'జై సింహా' కోసం కూడా అలాంటి ఒక లొకేషన్ ని బాలకృష్ణ ఎంపిక చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. కేఎస్ రవికుమార్ దర్శత్వంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న 'జై సింహా' ఆడియో వేడుకని ఎప్పటిలాగే డిఫ్రెంట్ ప్లేస్ లో జరపబోతున్నారట.

Advertisement
CJ Advs

అది ఏపీ రాజధాని అయిన విజయవాడ, గుంటూరు నడుమ ఉన్న హాయ్ ల్యాండ్ లో 'జై సింహా' ఆడియో వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నారట. వచ్చే ఏడాది మొదట్లో సంక్రాతి కానుకగా జనవరి 12 న విడుదలవుతున్న 'జై సింహా' ఆడియో వేడుకని ఈనెల 23 లేదా 24 తేదీలలో హాయ్ ల్యాండ్ లో నిర్వహిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. కరెక్ట్ గా డేట్ అయితే క్లారిటీ లేదుగాని ఆడియో వేడుక మాత్రం హాయ్ ల్యాండ్ ఫిక్స్ అంటున్నారు. ఇకపోతే 'జై సింహా'లో బాలకృష్ణ కి జోడిగా నయనతార, హరిప్రియ, నటాషా దోషీలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక 'జై సింహా' షూటింగ్ పూర్తయినప్పటికీ రెండు పాటల బ్యాలెన్స్ ఉండడంతో... మిగిలిన ఆ 2 పాటల షూటింగ్ కోసం డిసెంబర్ 8 నుంచి దుబాయ్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఆ పాటల షూటింగ్ తర్వాత ఆడియో రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుందని సమాచారం.

Jai Simha Movie Audio Venue Fixed:

Jai Simha Movie Audio Released in Hailand, Guntur
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs