Advertisement
Google Ads BL

కొడుకుతో దర్శనమిచ్చిన రమ్యకృష్ణ!


రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ టైటిల్‌ రోల్‌ని పోషించిన 'చంద్రలేఖ' సమయంలో వారి మధ్య గట్టి బంధం ఏర్పడింది. కానీ ఈ విషయాన్ని ఎంతో కాలం ఇరువురు భయపడకుండా సీక్రెట్‌గా మెయిన్‌టెయిన్‌ చేశారు. ఆ తర్వాత రమ్యకృష్ణ కెరీర్‌ హీరోయిన్‌గా ఫేడవుట్‌ అయిన సందర్భంలో మాత్రమే వారు అసలు గుట్టు విప్పారు. మరోవైపు కృష్ణవంశీ చూస్తే హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది. ఏదైనా షూటింగ్‌ ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్‌కి వస్తోంది. దాంతో వారి మధ్య విభేదాలు వచ్చాయని కొందరు, విడిపోయారని కొందరు అంటూ వచ్చారు. కానీ వారిద్దరు మాత్రం ఆ వార్తలను అసలు పట్టించుకోలేదు. 

Advertisement
CJ Advs

అయినా కృష్ణవంశీ ఇటీవల మాట్లాడుతూ, తరుచుగా నేను చెన్నై వెళ్లడం లేదా ఆమె హైదరాబాధ్‌ రావడం చేస్తున్నామని, తనను గైడ్‌ చేస్తోంది రమ్యకృష్ణనే అని చెప్పాడు. ఇక తాజాగా ఈ జంట ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది. 'బాహుబలి'లో శివగామి పాత్ర ద్వారా గ్రాండ్‌ రీఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణకి ఇప్పుడు ఎంతో డిమాండ్‌ ఉంది. ఇటీవలే నారా రోహిత్‌ 'బాలకృష్ణుడు'లో నటించింది. ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ 'హలో' చిత్రంలో అఖిల్‌కి తల్లిగా, జగపతిబాబుకి భార్యగా నటిస్తోంది. మరోవైపు తమిళంలో సూర్య, కీర్తిసురేష్‌ కలిసి నటిస్తున్న 'గ్యాంగ్‌' చిత్రంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తోంది. తమ్ముడు అఖిల్‌కి అమ్మగా నటించిన రమ్యకృష్ణ ప్రస్తుతం అన్నయ్య నాగచైతన్య-మారుతి దర్శకత్వంలో రూపొందనున్న 'శైలజారెడ్డి అల్లుడు'లో చైతూకి అత్తగా నటించనుంది. 

ఇక ఆమె నటించిన 'మాతంగి' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం వేడుకకు రమ్యకృష్ణ, ఆమె సోదరితో పాటు.. కుమారుడు రిత్విక్‌ ని తీసుకుని రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. కుమారుడుతో రమ్యకృష్ణ బాండ్ చూస్తుంటే.. కృష్ణవంశీ, రమ్యల మధ్య ఎటువంటి విభేదాలు లేవని తెలుస్తోంది.  పిల్లాడు కూడా బాగా యాక్టివ్‌గా ఉన్నాడు. మరి ఈ జంట తమ కుమారుడిని సైతం హీరోగా చేస్తారేమో చూడాలి..! 

Krishna Vamsi and Ramya Krishna Son Rithwik at Mathangi Press Meet:

Ramya Krishna Mathangi Press Meet Updates
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs