తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత బతికున్నంత కాలం ఆమె వ్యక్తిగత, కుటుంబ వివరాలను అడిగే ధైర్యం, సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. దాంతో ఆమె మరణం తర్వాత ఆమె జీవితంలోని రహస్యాలన్ని మట్టిలో కలిసిపోతాయని భావించారు. కానీ ఇప్పుడు జయని చూసి భయపడటానికి ఆమె బతికిలేదనే ధైర్యమో, లేక ఇప్పటికైనా నిజాలను బయటపెట్టాలనే ఉద్దేశ్యమో గానీ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఎప్పటినుంచో జయలలితకు, శోభన్‌బాబుకి సంబంధం ఉందని, ఎమ్జీఆర్‌కి భయపడి ఆమెతో పాటు శోభన్‌బాబు కూడా మౌనంగా ఉండిపోయారని, వారికి ఓ పాప ఉందని మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా జయకు, శోభన్‌బాబుకి జన్మించింది తానేనని అమృత అనే అమ్మాయి వాదిస్తోంది. మొదట్లో దీనిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే సెలబ్రిటీల తల్లిదండ్రులమని, కొడుకులమని ఇప్పటి వరకు ఎందరో వచ్చి వార్తల్లో నిలిచారు. ధనుష్‌కి తామే తల్లిదండ్రులని ఆమధ్య ఓవృద్ద దంపతులు కోర్టులో కేసు కూడా వేశారు.
ఇది కూడా అదే రకం పబ్లిసిటీ స్టంట్‌గా అందరూ భావించారు. కానీ బెంగుళూరులో ఉంటున్న అమృత మాత్రం జయ తనకి తల్లి అని కావాలంటే డీఎన్‌ఏ పరీక్షకైనా సిద్దమని చెబుతోంది. ఈమెకి అసలు తాను జయ కూతురిని అనేది ఎలా తెలిసింది? అనే విషయంపై అమృత మాట్లాడుతూ, నా పెంపుడు తల్లి చనిపోయే దాకా నేను ఆమె సొంత కూతురినే అని భావించాను. కానీ నా పెంపుడు తండ్రి చనిపోతూ తాను జయ బిడ్డనని చెప్పారు. బంధువులను విచారిస్తే నిజమే.. జయకి ఓ అమ్మాయి ఉంది. అది నువ్వే అన్నారు. జయ బతికి ఉన్నప్పుడు కూడా నేను కలిస్తే ముద్దులు పెట్టి ఎంతో ప్రేమగా కన్నీరు పెట్టుకుని, నీవు ఎక్కడ ఉన్నా ప్రాణాలతో ఉంటే అదే చాలు అని చెప్పేది అని చెబుతోంది అమృత. ఇక తాజాగా జయ అత్త, బెంగుళూర్‌లో ఉంటున్న లలిత మాట్లాడుతూ, జయ తండ్రి జయరామన్ మద్యానికి బానిసవ్వడంతో జయ వాళ్ల అమ్మ సంధ్యనే తన భర్తకి విషం ఇచ్చి చంపింది. సంధ్య కూడా నటే కావడంతో జయని సినిమాలలోనే ప్రోత్సహించింది.
జయరామన్ మరణం తర్వాత వారి ఇగోలు, వేధింపులు తట్టుకోలేక మేం ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేశాం. ఇక జయకి ఓ బిడ్డ ఉన్నది నిజమే. జయకి పురుడు పోసింది కూడా మా పెద్దమ్మే. అయితే ఆ బిడ్డే అమృతా కాదా? అనేది మాకు తెలియదు. దానికి మా వద్ద ఆధారాలు లేవని చెప్పింది. ఇక అమృత మాత్రం శశికళ వారే తనను జయను చూడనివ్వకుండా అడ్డుకున్నారని అంటోంది. మొత్తానికి ఇదేదో చూస్తే ఈ కథలో రాంగోపాల్‌వర్మకి బాగా నచ్చే అంశాలన్ని ఉన్నాయి అనిపిస్తోంది...!