Advertisement
Google Ads BL

దిల్ రాజు మూవీకి నో చెప్పిందట!


శేఖర్ కమ్ముల - దిల్ రాజులు కలిసి మలయాళ మలార్ సాయి పల్లవిని తెచ్చి వరుణ్ తేజ్ కేరెక్టర్ కన్నా ఒకింత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో పెట్టి ఫిదా సినిమాని చేసి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆ సినిమాలో భానుమతిగా సాయి పల్లవి నటించలేదు జీవించింది అనడం కరెక్ట్. అప్పట్లోనే దిల్ రాజు బ్యానర్ లో ఫిదాతో పాటు మరో రెండు సినిమాలు చేస్తానని సాయి పల్లవి అగ్రిమెంట్ కూడా చేసింది. అనుకున్నట్టుగానే సాయి పల్లవి మళ్ళీ దిల్ రాజు బ్యానర్ లో నాని తో కలిసి MCA  మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో నటిస్తుంది.

Advertisement
CJ Advs

ఈ సినిమాలోనూ సాయి పల్లవిని చూస్తుంటే.. నానిని డామినేట్ చేసేలాగే కనబడుతుంది. MCA  టీజర్ లో నాని కన్నా సాయి పల్లవి ఎక్కువ సహజంగా నటించిందంటున్నారు. మరి నేచురల్ స్టార్ నానినే తొక్కేస్తుందనే టాక్ కూడా వచ్చేసింది. అంటే ఈ సినిమాలోనూ సాయి పల్లవికి ఆమెకి కావాల్సిన పాత్ర దొరకబట్టే వెంటనే ఒప్పుకుని సెట్స్ మీదకెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది.  ఇప్పటికే సాయి పల్లవి తనకి పాత్ర నచ్చితేనే సినిమా చేస్తానని క్లారిటీ ఇచ్చేసింది. మరి అలా ఇచ్చినట్టుగానే సాయి పల్లవి చేసుకుపోతుంది.

అందులో భాగంగానే సాయి పల్లవి ఇప్పుడు తనకి తెలుగులో హిట్ ఇచ్చిన నిర్మాతకు నో చెప్పిందనే టాక్ వినబడుతుంది. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో మూడో అవకాశం వచ్చిందట. అయితే ఆ సినిమాలో తన పాత్రకి ఇంపార్టెన్స్ లేదు అనుకుని ఆ ఆఫర్ ని సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించిందట. దిల్‌ రాజు ఆమెకి భారీ పారితోషికం ఆఫర్‌ చేసినా కానీ.... తనకి ఆఫర్‌ చేసిన క్యారెక్టర్‌ ఎక్సయిటింగ్‌గా అనిపించకపోవడం వల్ల సాయి పల్లవి నో చెప్పిందట. అయితే దిల్ రాజు తన బ్యానర్ లో తెరకెక్కబోయే... శ్రీనివాస కళ్యాణం లో నితిన్ కి జోడిగా చెయ్యమని అడగ్గా.. ఆ పాత్రలో ప్రత్యేకత ఏం లేదని సాయి పల్లవి నో చెప్పడం.. అది కాస్తా పూజ హెగ్డేకి దక్కడం జరిగిపోయాయి. ఇప్పుడు దిల్ రాజు కి సాయి పల్లవి నో చెప్పిందని విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Sai Pallavi Rejects Dil Raju :

Sai Pallavi Says No to Dil Raju Srinivasa Kalyanam Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs