Advertisement
Google Ads BL

అజ్ఞాతవాసి ఓవర్సీస్ సంచలనం!


ఓవర్సీస్ లో త్రివిక్రమ్ సినిమాకి ఉన్న క్రేజే వేరు. ఆ విషయాన్నీ త్రివిక్రమ్ గత సినిమాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి కూడా. త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉంది. అతని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఓవర్సీస్ లో డాలర్ల పంట పండించాయి. అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాపై కూడా ఓవర్సీస్ లో విపరీతమైన క్రేజ్ రావడమే కాదు అక్కడ అజ్ఞాతవాసి సినిమా రికార్డు థియేటర్స్ లో విడుదలవుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. 

Advertisement
CJ Advs

ఓవర్సీస్ లో అజ్ఞాతవాసి సినిమాకి ఎప్పుడు ఏ సినిమాకి లేనంతగా క్రేజ్ ఉంది. అందుకే ఎప్పుడూలేనంతగా 209 కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు బయ్యర్లు. ఇంతవరకు ఇండియ‌న్ సినిమా ఈ రేంజ్‌లో యూఎస్‌లో విడుద‌ల కాలేద‌ని స‌మాచారం. అందుకు సంబంధించిన థియేటర్ల లిస్ట్‌ కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. ఇటు జ‌న‌వ‌రి 9న ప్రీమియ‌ర్ షోకి ప్లాన్ చేస్తుండ‌గా, దీనికి సంబంధించి ఎరేంజ్‌మెంట్స్ కూడా జ‌రుగుతున్నాయ‌ట‌. గతంలో బాహుబలి-2...126 కేంద్రాలు, ఖైదీ నెంబర్ 150- 74, కబాలి-73, దంగల్- 69 సెంటర్స్‌లో రిలీజైన విషయం తెలిసిందే.

మరి ఇప్పటికే అజ్ఞాతవాసి ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలో 21 కోట్లకు అమ్ముడుపోయాయని న్యూస్ ఉండనే వుంది. అందుకు అనుగుణంగానే అజ్ఞాతవాసి టీమ్ కూడా ఓవర్సీస్ లో అజ్ఞాతవాసి ప్రమోషనల్ ఈవెంట్స్ ని కూడా గట్టిగా నిర్వహించాలనే ఆలోచనలో ఉందట. ఇకపోతే జనవరి 10 న విడుదల కాబోతున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే భారీగా 1500 థియేటర్స్‌లో విడుదల చేసేందుకు బయ్యర్లు ప్లాన్ చేస్తున్నప్పటికీ... ఇంకా సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలు విషయంలో బయ్యర్లు తర్జన భర్జనలు పడుతున్నారట.

Agnyaathavaasi Twice As Big As Baahubali 2!:

Agnyaathavaasi to Release in 209 Locations in the USA!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs