విదేశీయులు మన దేశంకి పర్యటన కోసం వచ్చినప్పుడు వారికి ఇక్కడి వాతావరణం, ఎండ, పొల్యూషన్ వల్ల ఆర్యోగం కాస్త ఇబ్బంది పెట్టే మాట వాస్తవం. తాజాగా ఇండియాకి పర్యటన కోసం వచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టు ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీలోని పొల్యూషన్‌ని తట్టుకోలేక ముఖం నిండామాస్క్‌లు ధరించి, శ్వాసపీల్చడంలో కూడా ఇబ్బంది పడ్డారు. అలాంటి వారికి మన వాతావరణం, పొల్యూషన్, ఇక్కడి నీరు, ఆహారం సరిగా పడటం లేదంటే ఆలోచించవచ్చు. కానీ మన దేశంలోనే పుట్టి పెరిగిన వారికి కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటికి మనం అలవాటు పడిపోయాం.
కానీ కొందరు పెద్దలు మాత్రం ఇండియాలో ఉండలేకపోతున్నాం.. ఇండియాలో అసహనం పెరిగిపోతోంది.. ఇక్కడ ఉండలేకపోతున్నాం.. ఇక్కడి వాతావరణం మాకు గిట్టడం లేదంటూ ఆశ్యర్యకరమైన మాటలు చెబుతూ ఉంటారు. 150 కోట్లకి పైగా జనాభా ఉన్న దేశంలో సామాన్యులు అందరు బతుకుతుండగా లేనిది ఈ కోటీశ్వరులైన సెలబ్రిటీలు మాత్రం ఇక్కడ ఎండా కాలం ఉంటే విదేశాలలో షూటింగ్స్ పెట్టుకుంటారు. మరికొందరు ఇక్కడ చలి కాలం ఉంటే వేడిగా ఉండే దేశాలలో పర్యటించి వస్తారు. అలా డబ్బున్న వాడికి ప్రతిది రోగమే అనిపిస్తుంది. తాజాగా మన కండల వీరుడుకి కూడా ఇండియాలో వాతావరణం పడటం లేదట. ఈ వాతావరణం బాగా లేకపోవడం వల్లనే తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని అంటూ బాధపడుతున్నాడు.
ఈయన ప్రస్తుతం బిగ్‌బాస్‌షో సీజన్ 11కి హోస్ట్‌గా చేస్తుండటంతో పాటు 'టైగర్ జిందాహై' ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు. తనకు ఈ వాతావరణం పడటం లేదంటూ కొత్త మాట చెబుతున్నాడు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలకానుంది. ఇందులో సల్మాన్ సరసన ఆయన మాజీ ప్రియురాలు కత్రినాకైఫ్ నటిస్తోంది. ఒకవైపు సల్మాన్‌కి 'ట్యూబ్‌లైట్' పగిలిపోయిన తరుణంలో, కత్రినా వరుస ఫ్లాప్‌లలో ఉన్నందున ఈ ఇద్దరికి ఈ చిత్రం అత్యంత కీలకం కానుంది.