Advertisement
Google Ads BL

అజ్ఞాతవాసి ఆఖరి రోజు ఖుష్బూ రియాక్షన్!


పవన్ - త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ పూర్తికావడము హీరో హీరోయిన్స్ మిగతా నటీనటుల డబ్బింగ్ పూర్తికావడము చక చకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో భారీ తారాగణమే నటించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి  కావడంతో ఇప్పటివరకు ఒకే కుటుంబంగా కలిసి ఉన్న నటీనటులు ఒకింత భావోద్వేగానికి లోనవుతున్నారు. అందులో నటి ఖుష్బూ ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు తెలుగులో మళ్లీ అజ్ఞాతవాసితో రీఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసి మొదటి రోజు షూటింగ్ చాలా సంతోషంగా జరిగిందని చెప్పింది.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు తాజాగా అజ్ఞాతవాసి సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో.. కొంత‌మంది వ్య‌క్తుల‌ను విడిచి వెళ్తుంటే చాలా బాధ‌గా ఉంటుంద‌ని ట్వీట్ చేసింది. ఈ సినిమాలో ఖుష్బూ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్బూ పాత్రకి సంబందించిన షూట్ మొత్తం ఈ సోమవారంతో కంప్లీట్ కావడంతో.. చివరి రోజు షూటింగ్ లో పాల్గొన్న ఖుష్బూ అంద‌ర్నీ మిస్ అవుతున్నాన‌ని ట్వీట్ చేసింది. కొంతమందిని వదిలి వెళుతుంటే బాధగా ఉంటుందని.. అజ్ఞాతవాసి చిత్ర బృందం నుండి వెళుతున్నప్పుడు చాల బాధగా ఉందని.. ఈ సినిమా చిత్ర బృందం అంతా ఒక కుటుంబం.. ఇంతమంచి వ్యక్తులను వదిలి వెళుతుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయని ఎమోషనల్ గా ట్వీట్ చేసింది.

అంతేకాకుండా అజ్ఞాతవాసిలో అవకాశం ఇచ్చినందుకు ఖుష్బూ త్రివిక్రమ్ కి ధన్యవాదాలు తెలియజేసింది. దర్శకుడు త్రివిక్రమ్ తో క‌లిసి ప‌నిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే... ప్రియ‌మైన స‌హ‌న‌టుడిగా ఉన్నందుకు ప‌వ‌న్‌కళ్యాణ్ కు కృత‌జ్ఞ‌త‌లు.. మీ అంద‌రినీ మిస్ అవుతున్నా అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేసింది ఖుష్బూ. ఇకపోతే పవన్, అను ఇమ్మాన్యుయేల్ కీర్తి సురేష్ నటిస్తున్న అజ్ఞాతవాసి జనవరి 10  సంక్రాతి కానుకగా విడుదల కాబోతుంది.

Kushboo About Agnathavasi Movie:

Kushboo’s emotional tweet on Pawan Kalyan’s ‘Agnathavasi’ Team
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs