ప్రస్తుతం సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా బాగా విస్తృతమైన నేపధ్యంలో సెలబ్రిటీ అనే పదానికే అర్ధమారుతోంది. లెజెండ్‌ల నుంచి సెలబ్రిటీల వరకు చేసే వికృతాలతో వాటికి ఉన్న విలువ బహిరంగంగానే నాడు చిరంజీవి, మోహన్‌బాబు మీడియా, సభికుల సమక్షంలోనే 'లెజెండ్' అంటే ఏమిటి? 'సెలబ్రిటీ' అంటే ఏమిటి? అని ఆ రెండు పదాలను భ్రష్టుపట్టించారు. ఇక నేడు బుల్లితెరపై రేష్మి, అనసూయ, హైపర్ ఆది, శ్రీముఖి, యాంకర్ రవి వంటి వారు ఆల్‌రెడీ తామేదో సెలబ్రిటీలు అయిపోయినట్లు ఫోజులు కొడుతున్నారు. బుల్లితెరపై అసభ్యం, అశ్లీలత, చీప్ కామెంట్స్, సెటైర్లు, కామెడీ పేరుతో అతి చేస్తున్నారు. బుల్లితెర నుంచి వెండితెరపైకి వెళ్లాలని, లక్షల గుర్తింపు ఉన్న తాము కోట్లాది ప్రజల గుర్తింపును కూడా తెచ్చుకోవాలని ఉబలాటపడిపోతున్నారు. ఇక వీరిని, వీరి బిహేవియర్‌ని, వీరి డ్రస్సింగ్‌ని, బూతుని ఎవరైనా ఖండిస్తే.. విమర్శించిన వారిని 'మీకు కూడా సెలబ్రిటీలు కావాలనే ఆశ ఉన్నట్లు ఉంది. అందుకే మమ్మల్ని విమర్శిస్తే మీరు సెలబ్రిటీలుగా మారి, అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు' అని ఎదురు దాడి చేస్తున్నారు. నిజానికి తమ అతి యాటిట్యూడ్‌ని చూపించి... వారే మరింత ఆదరణ కోరుకుంటున్నారనేది వాస్తవం.
కత్తిమహేష్‌ని విమర్శించే హైపర్ ఆదినే తన కామెంట్స్ ద్వారా పెద్ద సెలబ్రిటీ కావాలని చూస్తున్నాడు గానీ విమర్శించే కత్తి మహేష్‌కి ఆ ఉద్దేశ్యం ఉన్నట్లు పెద్దగా కనిపించదు. ఇక తాజాగా తమకి ఉన్న ఆత్రాన్ని యాంకర్ రవి నోరుజారి చెప్పేశాడు. ఏదైనా సెన్సేషన్ సృష్టిస్తేనే గుర్తింపు వస్తుందని ఆయన అన్నాడు. కాగా మొత్తానికి ఈయన కూడా బుల్లితెర ద్వారా పాపులర్ అయి ప్రస్తుతం వెండితెరపై 'ఇది మా ప్రేమకథ' చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. ఇక తనకు పెళ్లయిందా? లేదా? అనేది చెప్పాల్సిన అవసరం తనకు లేదని, అది నా పర్సనల్ విషయమని చెప్పాడు. పలు వార్తలు సోషల్ మీడియాలో వస్తుండటం కామనే అంటూ తనకు లాస్యతో మంచి కంఫర్ట్‌జోన్ ఉండేదని, ఇప్పుడు శ్రీముఖితో కూడా అంతే కంఫర్టబుల్ జోన్‌గా ఫీలవుతున్నానన్నాడు.
అయితే శ్రీముఖితో తాను మరింత కంఫర్టబుల్‌గా ఫీలవుతానని, ఆమె నేను ఏమి అన్నా పట్టించుకోదు అంటూనే, మా ఇద్దరికి కంఫర్టబుల్‌గా అండర్‌స్టాడింగ్ ఉన్నప్పుడు ఎవరో ఏదో అంటే పట్టించుకోవాల్సిన పనిలేదన్నాడు. నిజమే.. వారిద్దరికి అంత బాగా కంఫర్టబుల్‌గా ఉంటే సొంతంగా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. అంతే గానీ కోట్లాది మంది కుటుంబసమేతంగా చూసే ప్రోగ్రాంలలో మీకు బాగా కంఫర్ట్ ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మాత్రం తప్పు. ఒకరకంగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు 'అర్జున్‌రెడ్డి' తరహాలో తమదైన యాటిట్యూడ్‌లో పాపులర్ కావాలని కోరుకుంటున్నారే గానీ తమకున్న టాలెంట్‌తో కాదనేది వాస్తవం...!