Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, చరణ్ ల మధ్య ఎమోషన్స్ తోనే సినిమా!


ఐదేళ్లపాటు బాహుబలి సీరీస్ తో కష్టపడిన రాజమౌళి ఇప్పుడు ఫుల్ రెస్ట్ లో ఉన్నాడని అనుకుంటున్నారు అంతా. కానీ రాజమౌళి మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టి చాలాకాలమే అయ్యిందనే విషయం మొన్న.. రాజమౌళి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో వరకు అర్ధం కాలేదు జనాలకు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పేసాడు రాజమౌళి. బాహుబలి సినిమా గ్రాఫిక్స్ విషయంలో ఎంతో శ్రమటోడ్చిన రాజమౌళి తన తదుపరి చిత్రం ఎలాంటి  గ్రాఫిక్స్ ఉండవనే విషయాన్నీ ఎప్పుడో మీడియా ముఖంగా చెప్పేశాడు.

Advertisement
CJ Advs

మరి ఇద్దరు బడా స్టార్స్ తో సినిమా ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఇప్పుడు గ్రాఫిక్స్ లేకుండా ఎలా చెక్కుతాడా? అనే అనుమానం కొందరిలో ఉంది. అయితే రాజమౌళి... ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కడా చోటివ్వకపోయినా.. గ్రాఫిక్స్ కంటే ఎమోషన్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సినిమా స్క్రీన్ ప్లే అల్లుతున్నారట. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళికి కథా రచయిత విజయేంద్రప్రసాద్ మధ్య చర్చ కూడా జరిగిందనే టాక్ వినబడుతుంది. ఇక ఈ సినిమాలో చరణ్ పాత్ర, ఎన్టీఆర్ పాత్ర ఎలావుండబోతుందో.. అనేది వారిద్దరికీ రాజమౌళి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడంటున్నారు .

ఇక పక్కా స్క్రీన్ ప్లే పూర్తిగా సిద్దమయ్యాక ఎన్టీఆర్ కి చరణ్ కి మరోసారి కథని వినిపిస్తాడట రాజమౌళి. అలాగే సినిమాలో ఎమోషనల్ డ్రామా ఉంటుందని.. గ్రాఫిక్స్ ఉండవనే విషయాన్నీ కూడా హీరోలిద్దరికి క్లారిటీగా చెప్పాడట. ఇకపోతే గ్రాఫిక్స్ లేకపోయినా యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదని... హై ఎమోషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులతో పక్కా  కమర్షియల్ సినిమాని ప్రేక్షకులకు అందిస్తాడట రాజమౌళి.

No Graphics in Rajamouli Next Film :

Rajamouli film on Jr NTR and Ram Charan Emotions 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs