'గురు' సినిమా తర్వాత వెంకీ సైన్ చేసిన ప్రాజెక్ట్ గాని వెంకీ నుండి మరో సినిమా గానీ.. ఇప్పటివరకు విడుదల కాలేదు. ప్రస్తుతం దర్శకుడు తేజతో కమిట్ అయిన వెంకటేష్ వచ్చే ఏడాది అయితే నాలుగు సినిమాలు తన నుండి వస్తాయని అభిమానులకు చెబుతున్నాడు. ఈ ఏడాదిలో వెంకటేష్ చాలా గ్యాప్ తీసుకుని తేజతో సినిమా పట్టాలెక్కించబోతున్నాడు. ఆ సినిమా రేపో మాపో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఇక ఆ సినిమా టైటిల్ కూడా 'ఆటా నాదే వేటా నాదే' అని ప్రచారంలో ఉంది. అయితే వెంకటేష్ గుంటూరులో ఒక బట్టల షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ వెంకీని మీడియా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ ఏడాది చివరికి వచ్చేసింది.. వచ్చే ఏడాది నా నుండి నాలుగు సినిమాలు ఖచ్చితంగా వస్తాయని మాట ఇచ్చేశాడు.
మరి ప్రస్తుతం తేజ సినిమా ఒకటి చేస్తున్న వెంకటేష్, ఇంకో సినిమాని దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మల్టి స్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోపక్క వెంకీ 'సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం' దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి మరో సినిమాకి కమిట్ అయ్యాడనే న్యూస్ ఉంది. మరి వెంకటేష్ ఇలా నాలుగు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించేస్తాడా? లేదంటే ఒకదాని తర్వాత మరొకటి చేస్తాడో తెలియదు గాని అభిమానులకు మాత్రం 2018 లో తన నుండి నాలుగు సినిమాలుంటాయనే మాట మాత్రం ఇచ్చేశాడు.