Advertisement
Google Ads BL

బాలయ్య, మహేష్.. బోయపాటి జాక్ పాట్!


ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ.. ఎవరి నోటా విన్నా మల్టీస్టారర్ సినిమాల గురించిన చర్చలే. అన్నిటికన్నా ఎక్కువగా రాజమౌళి మల్టీస్టారర్ గురించి మాత్రం హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఇది వినగానే అందిరికి షాక్. అయినా రాజమౌళి తలచుకుంటే అదెంతసేపు అనుకునేలోపు నితిన్ - శర్వానంద్ లు కలిసి ఒక మల్టీస్టారర్ ని ఓకే చెయ్యడం, సీనియర్ హీరో వెంకటేష్ మరో హీరో రాజశేఖర్ తో కలిసి నటించడానికి రెడీ అవ్వడం, అలాగే మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అటుంచి ఇప్పుడు మరో బడా మల్టీస్టారర్ గురించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అదేమిటంటే బోయపాటి దర్శకత్వంలో మహేష్ బాబు - బాలకృష్ణలు కలిసి ఒక మాస్ మల్టీస్టారర్ చేయబోతున్నారనే న్యూస్ హాట్ హాట్ గా మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేవలం ఆ న్యూస్ చక్కర్లు కొట్టడమే కాదు... బోయపాటి శ్రీను ఇప్పటికే మహేష్, బాలయ్యలకి ఒక స్టోరీ లైన్ వినిపించినట్లుగా.. ఆ లైన్ అటు మహేష్ కి ఇటు బాలయ్యకి నచ్చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. స్టోరీ లైన్ నచ్చిన ఈ ఇద్దరు హీరోలు బోయపాటికి ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చెయ్యమని.. అప్పుడు కథ ఫైనల్ చేశాక సినిమా గురించి ఆలోచిద్దామని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి.

మరి బాలకృష్ణతో బోయపాటి 'సింహా, లెజెండ్' వంటి సూపర్ హిట్ సినిమాలు తీశాడు. బోయపాటి మేకింగ్ స్టయిల్ బాలయ్యకి తెలుసు. కానీ మహేష్ మాత్రం ఇప్పటివరకు బోయపాటితో చేసింది లేదు. కానీ బోయపాటి దర్శకత్వంలో మహేష్ ఒక సినిమా చెయ్యడానికి ఇదివరకే అంగీకరించినట్లుగా వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను, రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాడు. రామ్ చరణ్ తో సినిమా పూర్తయ్యేలోపు అటు బాలయ్యని, ఇటు మహేష్ ను కరెక్ట్ గా లైన్ లో పెట్టి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు బోయపాటి. ఇకపోతే ఈ బడా మల్టీస్టారర్ సినిమాని 14  రీల్స్ వారు నిర్మించే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా వార్తలొస్తున్నాయి. 

Sensational News on Balayya and Mahesh Babu Multistarrer:

Mass director Boyapati Sreenu is reportedly planning a multi-starrer film with Balakrishna and Mahesh Babu. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs