Advertisement
Google Ads BL

ముద్దుకి కొత్త నిర్వచనం చెప్పింది!


ఇటీవల వచ్చిన సంచలన చిత్రం 'అర్జున్‌రెడ్డి' సినిమా చూస్తున్నంత సేపు అందులో ప్రీతి పాత్ర చేసిన షాలినిపాండేని మామూలుగానే చూశారు. కానీ థియేటర్‌ నుంచి బయటికి వచ్చిన తర్వాత మాత్రం ఆ పాత్ర మనలని వెంటాడుతూనే ఉంటుంది. ఈ చిత్రంలో ఆమె చేసిన పాత్ర ఎంతో బోల్డ్‌గా ఉండటమే కాదు.. ఇందులో ఎన్నో లిప్‌కిస్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రం సంచలన విజయం సాధించిన తర్వాత ఆమెకు తెలుగులో వచ్చిన '100%లవ్‌'కి రీమేక్‌గా తమిళంలో రూపొందుతున్న '100% కాదల్‌'లో అవకాశం దక్కించుకుంది. తెలుగులో తమన్నా ఇందులోని మహాలక్ష్మి పాత్రలో ఎలా మెప్పించి, ప్రశంసలు అందుకుందో అదే స్థాయిలో తనదైనశైలిలో ఈ చిత్రంతో తాను నటిస్తున్నానని షాలినిపాండే చెప్పుకొచ్చింది. ఇక ఈమె సావిత్రి బయోపిక్‌ 'మహానటి'లో కూడా నటిస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక ఈమె 'అర్జున్‌రెడ్డి'లోని తన పాత్ర గురించి చెబుతూ, నాకు ఇప్పటి వరకు ప్రేమానుభూతి కలగలేదు. ఇందులో ప్రీతి పాత్రలో భాగంగానే అర్జున్‌రెడ్డిని ముద్దు పెట్టుకున్నాను గానీ ఆ స్థానంలో నాకు విజయ్‌దేవరకొండ కనిపించలేదు. ఇక సినిమాలోని సీన్స్‌ డిమాండ్‌ చేస్తే బికినీలో నటించేందుకైనా సిద్దమే. మిగిలిన అమ్మాయిలతో పోలిస్తే నేను కొంచెం తేడా. నన్ను మరబొమ్మగా అబ్బాయిలు చూస్తుంటారు. 'అర్జున్‌రెడ్డి'లో ఎంతో ప్యాషన్‌తో లిప్‌కిస్‌ సీన్స్‌ చేశాను. అయినా ప్రేమ, కోపం లాగా ముద్దుపెట్టుకోవడం కూడా ఓ ఎమోషనే. దానికి అభ్యంతరాలు, ఇబ్బందులు పడటం ఎందుకో నాకు అర్ధం కావడం లేదు. ఇక '100%కాదల్‌' చిత్రం కోసం బరువు తగ్గాను. భవిష్యత్తులో నేను చేయగలనని భావించే పాత్రల్లోనే నటిస్తానని చెప్పుకొచ్చింది. 

Shalini Pandey Talks About Arjun Reddy Kiss Scenes:

Shalini Pandey gives New Meaning to Kiss 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs