తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, మరాఠి భాషల్లో హీరోయిన్‌గా జెనిలీయాకి ఎంతో గుర్తింపు ఉంది. తెలుగులో ఆమె 'సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ, ఆరెంజ్' వంటి చిత్రాలలో నటించింది. ముఖ్యంగా 'బొమ్మరిల్లు' చిత్రంలో ఆమె హా..హా..హాసిని అంటూ నటనలో అదరగొట్టేసింది. వీలైతే నాలుగు మాటలు, ఓ కప్పు కాఫీ అంటూ ప్రేక్షకుల గుండెల్లో అల్లరి అమాయకత్వం కలబోసినా నటిగా పేరుతెచ్చుకుంది. ఇక ఈమె బాలీవుడ్‌లో కూడా నటించింది. తన మొదటి బాలీవుడ్ చిత్ర హీరో రితేష్‌దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకుంది. రితేష్ దేశ్‌ముఖ్ తండ్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కావడం విశేషం.
ఇక ఈమె పెళ్లయిన తర్వాత ఓ మరాఠి చిత్రంలో, రెండు హిందీ చిత్రాలలో గెస్ట్ రోల్స్ చేసింది. ఇక ఈమె పెళ్లయి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా అదే గ్లామర్ మెయిన్‌టెయిన్ చేస్తోంది. ఇక ఈమె ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని త్వరలో ఓ మరాఠి చిత్రంతో పాటు దక్షిణాది చిత్రాలలో కూడా నటిస్తానని చెప్పేసింది. అయితే ఆమె శ్రీదేవి లాగా కేవలం తన చుట్టు తిరిగే పాత్రలనే చేస్తుందా? లేక సపోర్టింగ్ రోల్స్, అక్క, వదిన, అత్త, తల్లి.. ఇలా యంగ్ హీరోల చిత్రాలలో నటిస్తుందా? అనేది మాత్రం ఆసక్తిని కలిగిస్తోంది.