Advertisement
Google Ads BL

రజినీ ఆగమనం షురూ.. ఇంక సర్దుడే..!


శంకర్ '2.0' సినిమా అందరు అనుకున్నట్టుగానే జనవరి నుండి పోస్ట్ పోన్ అయ్యి ఏప్రిల్ కి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మేకర్స్ ఈ విషయమై క్లారిటీ ఇవ్వకపోయినా ఇప్పుడు ఆఫీషియల్ గా '2.0' నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కాబోతున్నట్టు ప్రెస్ కి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న '2.0' గ్రాఫిక్స్ వర్క్ కారణంగానే సినిమాని జనవరిలో విడుదల చెయ్యలేకపోతున్నామని.. అందుకే ఏప్రిల్ లో '2.0' విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని లైకా అధినేత మహాలింగం చెబుతున్నమాట.

Advertisement
CJ Advs

కాకపోయే ఏప్రిల్ 27 న '2.0' విడుదల చేస్తున్నామని ప్రకటించారు. రజినీకాంత్ హీరోగా, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా, లండన్ బ్యూటీ అమీ జక్షన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ఇన్ని అంచనాలున్న సినిమాకి పోటీగా నిలబడి తెలుగు సినిమాలను విడుదల చెయ్యాలంటే దర్శక నిర్మాతలు వల్ల అవుంతుందా!. అయితే ఏప్రిల్ నెలలో చాలా స్టార్ సినిమాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. అందులో మహేష్ 'భరత్ అనే నేను' సినిమా కూడా వుంది.

అంతే కాకుండా అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' కూడా ఏప్రిల్ లోనే విడుదలకు సిద్దమంటున్నారు. ఏప్రిల్ 27 ని  '2.0' నిర్మాతలు లాక్ చేయడంతో.. ఇక ఏ హీరో కూడా ఏప్రిల్ లో విడుదలకు సిద్దమవడు. సూపర్ స్టార్ రజినీకాంత్ కున్న క్రేజ్ అందరికి తెలిసిందే. ఇకపోతే రజినీకాంత్ మరో చిత్రం 'కాలా' సినిమాని ఆ సినిమా నిర్మాత ధనుష్ ఆగష్టు 15 న విడుదల చేయనున్నట్లు తేదీ ప్రకటించిన సంగతి తెలిసందే.

Rajinikanth 2.0 Release Date Locked:

Official press note from Lyca Productions is that 2 Point 0 will release in the month of April 2018. Trade speculation: 27 April 2018 has been locked as the date.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs