Advertisement
Google Ads BL

'హలో' ట్రైలర్ ఏమోగానీ నంది పంచ్ అదిరింది!


అఖిల్ రెండో సినిమా 'హలో' మూవీ టీజర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. అయితే ఆ టీజర్ ని అనుకోకుండా యూట్యూబ్ నుండి తొలగించడం.. మళ్ళీ కొన్నిగంటల్లోనే యూట్యూబ్ లో అఖిల్ 'హలో' టీజర్ ప్రత్యక్షమవడంతో.... కాస్త 'హలో' మీద ప్రేక్షకుల్లో చిన్న అనుమానం మొదలైంది. అయితే అఖిల్ మాత్రం 'హలో' టీజర్ విషయంలో ఏం జరగలేదని చెప్పినా... జరగాల్సిన డ్యామిజ్ జరిగిపోవడంతో... 'హలో' నిర్మాత నాగార్జున, దర్శకుడు విక్రమ్ కుమార్ లు 'హలో' ఆడియో రోజున విడుదల చెయ్యాల్సిన 'హలో' థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 1 శుక్రవారం సాయంత్రం హడావిడిగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటే హీరోయిన్ కళ్యాణి, అఖిల్ తల్లి పాత్రధారి రమ్యకృష్ణలు అదిరిపోయారనే కామెట్స్ పడ్డాయి.

Advertisement
CJ Advs

ఇక ఆ పాజిటివ్ కామెంట్స్ తోపాటు..  ఈ మూవీ ట్రైలర్ కట్ లో అక్కినేని నాగార్జున అండ్ టీం నంది అవార్డ్స్ కి గట్టి పంచ్ ని వేసింది. ట్రైలర్ స్టార్టింగ్ లో 'మనం' సినిమాకి మీ మనసుల్ని అవార్డ్స్ గా ఇచ్చినందుకు కృతజ్ఞతలు అనే అర్ధం వచ్చేలా ఆడియన్స్ కి కృతజ్ఞత చెప్పారు 'హలో' చిత్ర బృందం . అయితే ఈ పంచ్ మాత్రం బాలకృష్ణ 'లెజెండ్' కి అవార్డ్స్ వచ్చి 'మనం' మూవీకి నంది అవార్డు రానందుకే నాగార్జున ఇలా పంచ్ వేశాడు అని అందరూ గాసిప్స్ కి తెర లేపారు. అయితే ఖచ్చితంగా నాగార్జున ఇది కావాలనే నంది అవార్డుల మీద వేసిన పంచ్ అని చాలామందే ఫిక్స్ అయ్యారు కూడా.

మరి నాగ్ అసలు నంది అవార్డుల విషయంలో ఏం స్పందించకుండా సైలెంట్ గా ఉండి హుందాగా ప్రవర్తించాడు. మరి ఇప్పుడు ఇలా నందిపై ఇండైరెక్ట్ పంచ్ నాగ్ ఎందుకు వేసాడు చెప్మా.. అంటూ కొందరు దీర్ఘాలు తీస్తున్నారు. ఇకపోతే అఖిల్ - కళ్యాణిలు నటించిన 'హలో' మూవీ ఈ నెల 22 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.

Nagarjuna's Revenge on Balakrishna with Hello Trailer?:

<span>Controversy with 'From the makers of Manam to which you awarded your hearts' Words in Hello Trailer</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs