Advertisement
Google Ads BL

ప్రారంభం లోపు 'సై రా'కి ఈ క్లారిటీ ఇస్తారా?


మరీ 'సై..రా..నరసింహారెడ్డి' విషయంలో అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారని, దాంతోనే రెహ్మాన్‌తో పాటు రవివర్మన్‌ వంటి వారు వైదొలిగారని అంటున్నారు. ఇక రవివర్మన్‌ ప్లేస్‌ని రత్నవేలుతో భర్తీ చేయడం, ఆయన కూడా వెంటనే తన 'రంగస్థలం 1985 'తో పాటు 'సై..రా' లోకేషన్ల వేటలో సురేందర్‌రెడ్డితో పనిలోకి దిగిపోయాడు. కానీ రెహ్మాన్‌ తప్పుకోవడం మాత్రం ఇబ్బందే. ఇక ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌కి తమన్‌ మంచి సంగీతమే అందించాడు. అంతేకాదు సురేందర్‌రెడ్డికి ఈమద్యకాలంలో తమన్‌ ఆస్థాన సంగీత దర్శకునిగా మారాడు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'కిక్‌, రేసుగుర్రం' చిత్రాలు మ్యూజికల్‌గా కూడా హిట్టయ్యాయి. దాంతో రెహ్మాన్‌ స్థానాన్ని తమన్‌తోనే భర్తీ చేయాలని దర్శకుడు సురేందర్‌రెడ్డి భావిస్తుంటే చిరు, రామ్‌చరణ్‌లు మాత్రం సంగీతం అందించే వ్యకి దేశవ్యాప్తంగా పేరు, క్రేజ్‌, సినిమాకి న్యాయం చేసే మ్యూజిక్‌ని అందించడంతో పాటు దేశ వ్యాప్త ప్రచారానికి కూడా ఉపయోగపడాలని తమన్‌ని వద్దని చెబుతున్నారని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

ఇక దేశవ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న సంగీత దర్శకుని వేటలో చిరు, చరణ్‌లు ఉన్నారు. మరోవైపు సౌత్‌ ఇండియాకి చెందిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయితేనే ఈ చిత్రానికి నేటివిటీ విషయంలో న్యాయం చేయగలడని, తనకున్న అభిరుచికి తగ్గట్లుగా సంగీతం అందించేలా చేయగలనని సురేందర్‌రెడ్డి ఆలోచన. ఏమాత్రం తేడా వచ్చినా సంగీతమే మైనస్‌ అయినా ఆశ్యర్యపోనక్కరలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో మనం 'బాహుబలి'ని ఉదాహరణగా తీసుకోవాలి. ఇందులో ప్రభాస్‌, అనుష్కలతో పాటు సంగీతం కూడా తెలుగులో మంచి పేరున్న కీరవాణి అందించాడు. అంతకు ముందు కూడా ఆయన కొన్ని బాలీవుడ్‌ చిత్రాలకు, ఎమ్‌.ఎమ్‌.క్రీమ్‌ పేరుతో పనిచేసినా పెద్దగా క్రేజ్‌ రాలేదు. కానీ రాజమౌళి నమ్మకం ఉంచి మరీ కీరవాణికి బాధ్యతలు అప్పగించడం, దాంతో ఆయన కూడా అద్భుతమైన అవుట్‌పుట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఇక తమన్‌ కూడా తాజాగా ఓ బాలీవుడ్‌ చిత్రానికి సంగీతం అందించాడు. సౌత్‌లో కూడా ఆయన ఫేమస్‌. ఇక్కడ మరో విషయం ఏమిటంటే క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 100వ చిత్రమైన హిస్టారికల్‌ మూవీనే అయిన 'గౌతమీ పుత్ర శాతకర్ణి'కి చిరంతన్‌ భట్‌ని పెట్టుకున్నారు. బహుశా అలాంటి ప్రయోగం దిశగా అడుగులు వేస్తే మంచిదేమో? మరోవైపు ప్రభాస్‌ 'సాహో'కి సంగీతం అందిస్తున్న బాలీవుడ్‌ త్రయం శంకర్‌ ఎహసాన్‌ లాయ్‌లు 'విశ్వరూపం'తో పాటు సౌత్‌లో, నార్త్‌లో కూడా ఫేమస్‌. మరి ఆయన చేత ఏమైనా రెహ్మాన్‌ స్థానాన్ని భర్తి చేస్తారేమో చూడాలి..? మొత్తానికి ఈ చిత్రం షూటింగ్‌ ఈనెల 6న ప్రారంభం అయ్యేలోపే సంగీత దర్శకుడి విషయంలో క్లారిటీ వస్తుందేమో...! 

Sye Raa Team Hunts For Music Director:

No Clarity on Sye Raa Music Director 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs