పోర్న్‌స్టార్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసి నాలుగైదేళ్ల కిందట ఇండియాకి వచ్చి బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లో తన సెక్సీ అందాలు, ఐటం సాంగ్స్ చేస్తూ హాట్‌బ్యూటీగా పేరు తెచ్చుకున్న సన్నిలియోన్‌కి ఇక్కడ ఎంతగా వీరాభిమానులు ఉన్నారో తెలిసిందే. ఆ మద్య షారుఖ్‌ఖాన్ నటించిన 'రాయిస్'లో ఆమె చేసిన ఐటం సాంగ్ వల్లే ఆ చిత్రం అంతగా కలెక్షన్లు కొల్లగొట్టిందని చెప్పాలి. ఈ చిత్రంలో నటీంచిన షారుఖ్‌ఖాన్, సన్నిలియోన్‌లు సినిమా ప్రమోషన్ కోసం రైలు యాత్ర చేస్తే జనాలు ఆమెని చూడటానికి కిక్కిరిసిపోయారు. షారుఖ్‌ని పట్టించుకోకుండా ఆమె ఉన్న బోగీ వైపు దూసుకెళ్లిన సంఘటనలో పలువురు అభిమానులకు, పోలీస్‌లకు కూడా గాయాలయ్యాయి.
ఇక ఇటీవల ఈమె తిరువనంతపురం వస్తే అక్కడి జనం పోటెత్తారు. దాంతో వర్మ సైతం మోహన్‌లాల్, మమ్ముట్టిల కన్నా మలయాళంలో కూడా ఆమె స్టార్ అంటూ స్పందించాడు. ఇక ఈ ఏడాదిలో చివరిదైన డిసెంబర్ నెలలోకి ప్రవేశించాం. దాంతో యాహూ సంస్థ తమ సెర్చ్ ఇంజన్‌లో నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన వారి లిస్ట్‌లు ఒక్కొక్కటి వెల్లడిస్తోంది. ఈ ఏడాది యాహు సెర్చ్ ఇంజిన్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన భారతీయ నటిగా సన్నిలియోన్ మొదటి స్థానం దక్కించుకుంది. ఆమె దరిదాపుల్లో కూడా ఎవరు లేకపోవడం గమనార్హం. తద్వారా తన సత్తా ఏమిటో ఆమె మరోసారి నిరూపించింది. ఆ తర్వాతి స్థానాలలో ప్రియాంకాచోప్రా, ఐశ్వర్యారాయ్ వంటి వారు నిలిచి సర్దుకుపోయారు. ఇప్పుడు ఏ భాషా చిత్రమైనా కూడా సన్నిలియోన్ నటిస్తే అది దేశవ్యాప్తంగా క్రేజ్‌ని సంపాదించుకుంటుందని తాజా సంఘటనతో రుజువైంది.
ఇక నటులలో ఎక్కువగా సెర్చ్ చేసిన నెటిజన్ల జాబితాలో ఈ ఏడాది మరణించిన వెటరన్ బాలీవుడ్ స్టార్ వినోద్‌ఖన్నా నిలిచాడు. ఆయన మరణించడంతో ఆయన గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపడంతో ఆయనది మొదటి స్థానం దక్కింది. ఇక రెండో స్థానంలో ఆశ్చర్యకరంగా కపిల్‌శర్మ నిలిచాడు. మొత్తానికి సన్ని క్రేజ్‌ని చూస్తుంటే ట్రంప్, మోదీల సరసన అంత క్రేజ్ ఉన్న సెలబ్రిటీగా ఆమె నిలిచినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.