Advertisement
Google Ads BL

'హలో' టీజర్: అంతా సెల్ ఫోనే..!


ఒక చిన్న కథని తీసుకుని తనదైన శైలిలో సినిమాని నడిపించగల సత్తా ఉన్న దర్శకుడు విక్రమ్ కుమార్. అక్కినేని ఫ్యామిలీతో మనం వంటి పునర్జన్మల కథతో సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టాడు. అదే నమ్మకంతో నాగార్జున తన రెండో కొడుకు అఖిల్ ని విక్రమ్ చేతిలో పెట్టాడు. ఇక విక్రమ్ కుమార్, అఖిల్ తో ఒక మంచి యాక్షన్, ఫ్యామిలీ, రొమాంటిక్ ప్రేమకథ 'హలో' ని తెరకెక్కిస్తున్నాడు. ఎన్నో అంచనాలున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి టీజర్ వరకు అందరిని ఆకట్టుకుంది. అయితే సినిమా విడుదలకు ఇంకా 20 రోజులుండగానే 'హలో' థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసి ఆశ్చర్యపరిచారు.

Advertisement
CJ Advs

'హలో' టీజర్ కి కొనసాగింపుగా ఉన్న ఈ ట్రైలర్ లో టీజర్ లో చెప్పుకున్నట్టే నాగార్జున వాయిస్ ఓవర్ తో మొదలయ్యే ఈ ట్రైలర్ ని చూస్తుంటే.. సినిమా కథ మొత్తం ఒక సెల్ ఫోన్ చుట్టూతానే తిరిగేటట్టుగా కనబడుతుంది. ఇప్పటికే హలో పోస్టర్లో ఈ సెల్ ఫోన్ కి సంబందించిన క్లూస్ ఎప్పుడో రివీల్ చేసేసారు కూడా. ఇకపోతే శీను... అవినాష్ గా మరి తన సోల్మెట్ ని వెతికే పనిలో విలన్ తో ఫైటింగ్స్, ఛేజింగ్ లు బాగానే చేస్తున్నాడు. అసలు ట్రైలర్ లోనే సినిమా కథని పూర్తిగా రివీల్ చేసేసారు. ఇక ఈ హలో ట్రైలర్ లో హైలెట్స్ మాత్రం టీజర్ లో చెప్పినట్లే..  అఖిల్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అదిరాయ్. అలాగే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి లుక్స్ సూపర్. అంతే కాకుండా అఖిల్ కి యంగ్ మదర్ లా రమ్యకృష్ణ సూపర్ గా వుంది.

అఖిల్ మాత్రం ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతగా కష్టపడుతున్నాడో అనేది శాంపిల్ చూపించిన దర్శకుడు సినిమాలో ఇంకెన్ని అద్భుతాలు చూపిస్తాడో తెలియాలంటే అనేది డిసెంబర్ 22 వరకు ఓపిక పడితే సరిపోతుంది. నాగార్జున నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Click Here To See The HELLO Movie Trailer

Hello Theatrical Trailer Report:

Akhil Akkineni  Hello Movie Theatrical Trailer Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs