Advertisement
Google Ads BL

అనుష్కే కన్ఫర్మ్ అయ్యిందంట..!


గతంలో స్టార్ హీరోలందరికీ అనుష్క బెస్ట్ ఆప్షన్ గా కాకపోయినా ఎక్కువగా అనుష్కనే సంప్రదించేవారు. ఇక 'బాహుబలి' పుణ్యమా అని అనుకోని కీర్తి ప్రతిష్టలతో వెలిగిపోయింది అనుష్క. అలాంటి సమయంలో అనుష్క టైం సూపర్ గా ఉంటుంది అనుకున్నారు. కానీ సైజ్ జీరో వలన పెంచిన బరువుతో చాలా ప్రాబ్లమ్స్ లో పడింది. ఆ దెబ్బకే అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లోను అనుష్క హవా తగ్గింది. బాహుబలి సినిమా తర్వాత మరో స్టార్ హీరో సినిమాలోనూ అనుష్క లేదు. కానీ ఉన్నట్టుండి అనుష్క స్లిమ్ అయిన ఫోటోని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం.. ఆ వెనువెంటనే... ఒక న్యూస్ మీడియాలో చక్కర్లు కొట్టడం జరిగింది.

Advertisement
CJ Advs

ఇప్పుడు అనుష్కకి కోలీవుడ్ లో ఒక స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసినట్లుగా కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఒక పెద్ద ప్రాజెక్ట్ లో అనుష్క అవకాశం పట్టిందంటున్నారు. కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వాసం’లో అనుష్కనే కథానాయికగా ఫైనలైజ్ చేశారనే టాక్ నడుస్తుంది. అజిత్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివతో కలిసి 'వీరం, వేదాళం, వివేగం' సినిమాలు చేశాడు. ఇప్పుడు శివ దర్శకత్వంలో మరోసారి అజిత్ హీరోగా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలోనే అనుష్కే హీరోయిన్ అంటున్నారు.

ఇకపోతే  అజిత్, అనుష్క కలిసి ఇంతకుముందు ‘ఎన్నై అరిందాల్’ సినిమాలో నటించారు. కానీ ఆ సినిమాలో అజిత్ కి అనుష్కకి మధ్యన రొమాన్స్ కి చోటుండదు. ఎందుకంటే ఆ సినిమాలో మరో హీరోయిన్ త్రిష కూడా ఉంది. మరి అప్పుడు రొమాన్స్ లేకపోతేనే... ఇప్పుడు 'విశ్వాసం' లో అదరగొడతారంటున్నారు. ఇకపోతే అనుష్క నటించిన 'భాగమతి' జనవరి 26 న విడుదలకు సిద్ధమవుతోంది.

Anushka in Ajith Viswasam Movie:

Ajith and Siva movie Heroine Confirmed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs