'లండన్ బాబులు'తో హిట్ కొట్టాలన్న స్వాతిరెడ్డి ఆశలు అసలు ఫలించలేదు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈమె తెలుగులో తనకి ఎక్కువ చాన్స్‌లు రాకపోవడంపై స్పందిస్తూ.. నాకు నేనే మార్కెటింగ్ చేసుకోవడం రాదు. పెద్ద చిత్రాలంటే వారితో తిరగాలి.. సెల్ఫీలు తీసుకోవాలి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టాలి.. ఇలా ఎంతో తతంగం ఉంటుంది. నన్ను నేను మార్కెటింగ్ చేసుకోవడానికే నేను సంపాదించినదంతా ఖర్చుపెడితే ఎలా? అంటూనే నేను తెలుగు రానట్లు యాక్ట్ చేస్తే పరాయిభాషా అమ్మాయి అని ఎక్కువ చాన్స్‌లు ఇచ్చేవారేమో...అలాగే సినిమా ఫీల్డ్‌లో ఏమీ తెలియనట్లు, పెద్దగా తెలివిలేనట్లు ప్రవర్తించే వారికే చాన్స్‌లు వస్తాయి. ఆ తెలివితక్కువగా నటించే తెలివి నాకు లేదేమో అని సెటైర్లు వేసింది.
ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ.. బుల్లితెరపై 'కలర్స్' ద్వారానే ప్రేక్షకులు నన్ను బాగా చూసేశారు. ఇక సినిమాలలో ఈమె కొత్తగా చూపేది ఏముంది? అని భావించారేమో అంటూ ఇటు ఇండస్ట్రీ వారిపై, ఇటు ప్రేక్షకులపై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇక ఆమెకు 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' చిత్రంలో అవకాశం వచ్చింది. ఆనాటి రోజులను జ్ఞాపకం చేసుకుంటూ కృష్ణవంశీ సినిమాలు చూశానే గానీ ఆయన ఎలా ఉంటారో నాకు తెలియదు. ఈ చిత్రం మొదట్లో నేను, మా అమ్మ కలసి కృష్ణవంశీ ఆఫీస్‌కి వెళ్లాం. అందులోని ఓ రూంలో ఒకాయన ఉన్నాడు. మేము కూర్చుంటూనే స్క్రిప్ట్ చెప్పండి అని అడిగాం. దాంతో ఆయన పేపర్ తీసుకుని పెన్నుతో 'కెవి' అని రాశారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? అని ప్రశ్నించాడు. మా అమ్మ కామ్‌గా ఉండకుండా మీరు ఏం సినిమాలు చేశారు? అని ఆయన్ను అడిగింది. దానికి ఆయన కోపంగా నన్ను ఏం సినిమాలు చేశారని అడుగుతున్నారు? అసలు నువ్వెలా యాక్ట్ చేస్తావో చూద్దాం.. అని చెప్పి నా యాక్టింగ్‌ని చూసి బాగా చేశావు అని అన్నాడు. ఆ తర్వాత ఆ చిత్రం షూటింగ్‌లో ఆయన గొప్పతనం ఏమిటో తెలిసింది. అప్పటి నుంచి ఆయనంటే నాకు గౌరవం పెరిగింది అని చెప్పుకొచ్చింది.
గతంలో కూడా పెద్ద పెద్ద దర్శకులను కూడా స్వాతిరెడ్డి ఇలానే అవమానించిందని నాడు వార్తలు వచ్చాయి. ముందుగా ఓ చిత్రం అవకాశం వచ్చినప్పుడు ఆయన ఎవరు? ఏయే సినిమాలు చేశాడు? అనే కనీస కామన్‌సెన్స్ లేకపోతే కృష్ణవంశీ వంటి వారికి కోపం రావడం ఖాయం. అలాగని ఎలాగంటే అలా చేయమని కాదు గానీ కనీస మర్యాద లేకపోతే ఎలా? ఇక కలర్స్ స్వాతి, అంజలి, శ్రీదివ్య, ఆనంది వంటి వారికి ఇతర భాషల్లోనే మంచి అవకాశాలు వస్తున్నాయి. అయినా మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిగా పేరుతెచ్చుకుని తన ధోరణి వల్ల ఆమె ఇలా అవకాశాలను పాడుచేసుకుంటుంటే అది ఆమె స్వయంకృతాపరాధమేనని చెప్పాలి.