Advertisement
Google Ads BL

నిహారిక పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది..!


మెగా వారసురాలిగా, బుల్లితెరపై హోస్ట్‌గా కనిపించిన అమ్మడు నిహారిక కొణిదెల. ఈమె మొదటి చిత్రం 'ఒక మనసు' సరిగా ఆడలేదు. ఆసలు ఆమెను స్క్రీన్‌పై చూడటమే ఇష్టం లేదన్నట్లు మెగాభిమానులు ప్రవర్తించారు. ఇక ఆమె ముద్దు, రొమాంటిక్‌ సీన్స్‌లో నటిస్తే తట్టుకోలేకపోయారు. దాంతో ఆమె మరో ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన మంజుల అవుతుందేమోనని ఎందరో భావించారు. కానీ ఆమె మాత్రం తెలుగును వదిలి తమిళ చిత్రం ద్వారా కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. ఆమె ప్రస్తుతం విలక్షణ నటుడు విజయ్‌సేతుపతి, గౌతమ్‌ కార్తీక్‌ నటిస్తున్న 'ఓరు నల్ల నాల్‌ పాతు సొల్రెన్‌' చిత్రంలో నటిస్తోంది. దీనికి 'ఒక మంచి రోజు చూసి చెబుతా' అని అర్ధం. మొత్తానికి రెండో చిత్రంలో కూడా 'ఒక' అనే సెంటిమెంట్‌ని ఆమె ఫాలో అయింది. 

Advertisement
CJ Advs

కొత్త దర్శకుడు ఆర్ముగకుమార్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం టీజర్‌ని చూస్తే ఇది రొటీన్‌ చిత్రం కాదని తెలిసిపోతోంది. అటు ఫాంటసీ, ఇటు సోషల్‌ కలగలిపిన కథగా అనిపిస్తోంది. విజయ్‌సేతుపతి టెరిఫిక్‌ లుక్‌లో రాముడు నేనే.. రావణుడు నేనే అంటున్నాడు. దీంతో ఈ చిత్రంలో ఆయన హీరోగానే గాక విలన్‌గా కూడా నటిస్తున్నాడేమో అనిపిస్తోంది. ఇక ఇందులో నిహారిక అటు క్యాజువల్‌ గెటప్‌లోనే గాక నాటకాలు వేసే డ్రస్‌లో కూడా కనిపిస్తుండటం చూస్తే ఈమెది కూడా రెండు విభిన్న గెటప్‌లలో ఉండే పాత్ర అని అర్ధమవుతోంది. ఇక ఈ టీజర్‌లో నిహారిక ఓ తెలుగు డైలాగ్‌ చెప్పడం విశేషం. 'అవును.. అవును... మామా' అని చెప్పడంతో ఈ మూవీలో ఆమె తెలుగమ్మాయిగా కనిపించనుందా? అని అనిపిస్తోంది. 

మొత్తానికి ఈ చిత్రం హిట్టయితే తమిళంలోనే నిహారిక కొణిదెల సెటిల్‌ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మెగాభిమానుల గోల ఉండదు కాబట్టి హాయిగా తనకు నచ్చిన పాత్రలను చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రం తెలుగులో కూడా డబ్‌ కావడం ఖాయం. మరోవైపు నిహారిక సుమంత్‌ అశ్విన్‌ హీరోగా రూపొందుతున్న 'హ్యాపీ వెడ్డింగ్‌'లో కూడా హీరోయిన్‌గా నటించనుంది. 

Niharika acted oru naal paathu solren teaser released:

Niharika Impressed in oru naal paathu solren teaser 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs