Advertisement
Google Ads BL

మహేష్, అల్లు అర్జున్ క్లాష్ లేనట్లే!


ఏప్రిల్ 27న అల్లు అర్జున్ - వక్కంతం వంశీ నా పేరు సూర్య తో పాటే మహేష్ బాబు - కొరటాల శివ భరత్ అనే నేను సినిమాలు విడుదలకు సిద్దమవడంతో... నిర్మాతల మధ్య అగ్గి రాజుకుంది.  ముందుగా ఏప్రిల్ 27 న తన సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు అల్లు అర్జున్. కానీ తర్వాత అదే తేదీని మహేష్ కూడా తన సినిమావస్తుంది అని ఎనౌన్స్ చేశాడు. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని అంతా భావించారు. దీనిపై కొన్ని రోజుల కిందట బన్నీ వాస్ కేంద్రంగా చిన్న వివాదం కూడా నడిచింది. ఫైనల్ గా ఆ తేదీ ఇప్పుడు మహేష్ కే దక్కింది అనే న్యూస్ వినబడుతుంది.

Advertisement
CJ Advs

ఏప్రిల్ 27 రేస్ నుండి అల్లు అర్జున్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి ఒక కారణం కూడా ఉంది అంటున్నారు. అదేమిటంటే రాజమౌళి... రామ్ చరణ్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ ఎనౌన్స్ చేశాడు. దీనితో కొరటాలతో సినిమాలు చెయ్యాలనుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు హోల్సేల్ గా కొరటాలకు హ్యాండ్ ఇచ్చేసారు. ఆ దెబ్బకి కొరటాలకి అల్లు అర్జున్ కి సెట్ అయ్యిందనే టాక్ నడుస్తుంది. అది నిజమా.. కాదా... అనేది క్లారిటీలేదుగాని.. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ తో కొరటాల కమిట్ అయ్యాడంటూ గట్టిగానే వార్తలు వినబడుతున్నాయి.

ఆ నేపథ్యంలోనే ఒకవైపు కొరటాలతో సినిమా చేస్తూ.... మరోవైపు  ఆ దర్శకుడు తెరకెక్కించిన భరత్ అనే నేను సినిమాకు పోటీగా నా పేరు సూర్యను విడుదల చేయడం బాగోదు గనక అల్లు అర్జున్ తన సినిమా నా పేరు సూర్య రిలీజ్ ను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇది గాలి వార్తా.... లేకుంటే నిజంగా నిజమేనా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

No Clash Between Mahesh and Allu Arjun Movie:

Koratala Siva Clears Bunny and Mahesh Fight  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs