Advertisement
Google Ads BL

రంగస్థలం రిలీజ్ డేట్ ఫిక్సయిందా..!


సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ - అక్కినేని వారి కోడలు సమంత జోడీగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా, షూటింగ్ దాదాపుగా చివరిదశకి చేరుకుంది. ఇక షూటింగ్ కంప్లీట్ అయినా పాటల చిత్రీకరణ మిగిలేవుంది కాబట్టి...  వచ్చే నెలంతా కూడా ఈ సినిమాలోని పాటల చిత్రీకరణపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట చిత్ర బృందం. పాటల చిత్రీకరణ పూర్తికాగానే... మిగతా పనులన్నీ అంటే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని ఫిబ్రవరి నాటికి పూర్తిచేసుకుని, మార్చి లో సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.

Advertisement
CJ Advs

అది కూడా మార్చి16 నే రామ్ చరణ్ 'రంగస్థలం 1985' సినిమాని ప్రేక్షకుల ముందుకు తేవాలని మేకర్స్ అనుకుంటున్నారట. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడుతుందంటున్నారు. ఇక రంగస్థలం సినిమా ఫస్ట్ లుక్ కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రంగస్థలం సినిమా మొదలైనప్పుడు ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తామని చెప్పి.... ఆ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అందువలన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సంక్రాంతికి రిలీజ్ చేసి, అభిమానులు నిరుత్సాహానికి లోను కాకుండా చూడాలని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.

తప్పనిసరిగా సంక్రాంతికి రంగస్థలం ఫస్ట్ లుక్ వచ్చేస్తుందనే అంటున్నారు. మరి మొన్నామధ్యన దసరా అన్నారు. అది కుదరలేదు. ఇప్పుడు సంక్రాంతికైనా వదులుతారో లేదో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో ఆది పినిశెట్టి, యాంకర్ అనసూయలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Rangasthalam 1985 Movie Release Date Confirmed:

Rangasthalam 1985 Movie Release date Locked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs