నాగార్జున - రామ్ గోపాల్ వర్మ కలయికలో తెరకెక్కుతున్న సినిమాలో అనుష్క హీరోయిన్ అనే వార్త గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నాగ్ - వర్మ కలయికలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటి షెడ్యూల్ని పది రోజుల రెగ్యులర్ షూటింగ్ తో పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండబోతుందని.. హీరో - హీరోయిన్స్ కి అసలు రొమాంటిక్ సన్నివేశాలే ఈ సినిమాలో లేవనే ప్రచారం జరిగింది.
ఇకపోతే ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నాగ్ పక్కన ఫైనల్ అన్నారు. కానీ దర్శకుడు వర్మ మాత్రం నాగార్జున సరసన అనుష్క కాదని తన ఫేస్ బుక్ లో క్లారిటీ ఇచ్చాడు. అనుష్కని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవడంలేదని.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఒక కొత్త బ్యూటీని తీసుకున్నామని... ఆమె పేరు మైరా సరీన్ అంటూ ఫేస్ బుక్ లో ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. మరి అనుష్క, నాగార్జున పక్కన నటించడంలేదు అని.. ఒక కొత్త మ్మాయిని టాలీవుడ్ లోకి దింపుతున్నట్లుగా పోస్ట్ చేశాడు.
రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నటీనటుల ఎంపికపై వర్మ ఫోకస్ పెట్టాడని కొందరు అంటున్నారు. అందులో భాగంగానే రెగ్యులర్ టాప్ హీరోయిన్ అయితే బడ్జెట్ ఎక్కువ కావాలని.. ఒక కొత్త అమ్మాయి అయితే అనుకున్న బడ్జెట్ లో మూవీ పూర్తవుతుందని వర్మ భావిస్తున్నాడేమో... అందుకే ఇలా కొత్తమ్మాయిని సెలెక్ట్ చేశాడనే టాక్ వినబడుతుంది.