టాలీవుడ్ సినిమాల్లో, యంగ్ హీరోల సినిమాల్లో స్టైలిష్, అండ్ కూల్ విలన్ గా ఆది పినిశెట్టి ఈ మధ్యన అదరగొడుతున్నాడు. సరైనోడులో ఆది పినిశెట్టి నటన అల్లు అర్జున్ పాత్రకి సరితూగేలా ఉంది. అందుకే ఆది కూడా వచ్చిన విలన్స్ అవకాశాల్ని కాదనకుండా చేసుకుపోతున్నాడు. హీరోగా కన్నా ఎక్కువగా విలన్ గానే మంచి పేరు కొట్టేశాడు ఆది పినిశెట్టి. ఇక ఇప్పుడు మాగ్జిమమ్ విలన్ పాత్రలకే ఆది పినిశెట్టి మొగ్గు చూపుతున్నాడంటే ఆశ్చర్యపోవక్కర్లేదు కూడా. ఇకపోతే ప్రస్తుతం ఆది పినిశెట్టి ఒకేసారి ఇద్దరు మెగా హీరోల సినిమాల్లో నటిస్తున్నాడు.
రామ్ చరణ్ తో రంగస్థలం 1985 లోను, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలోనూ ఆది పినిశెట్టి కీలక అంటే మోస్ట్లీ విలన్ పాత్రల్లోనే కనబడనున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ - సుకుమార్ ల రంగస్థలం 1985 సినిమాలో ఆది నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది. తాజాగా చిత్ర యూనిట్ నుంచి మరొక న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్, ఆది పినిశెట్టిలు అన్నదమ్ముల్లా కనిపించబోతున్నారట. అంతే కాకుండా ఆది పినిశెట్టి చేసే పాత్ర రామ్ చరణ్ చేసే పాత్రతో ఈక్వల్ గా ఉంటుందట.
చరణ్ పాత్ర మీద ఆది పాత్ర ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయే పాత్ర అంటున్నారు. మరి సుకుమార్ తన మేకింగ్ స్టయిల్ తో చరణ్, ఆదిలను సూపర్ గా చూపించబోతున్నాడట. అలాగే రామ్ చరణ్, ఆది పినిశెట్టి ల మధ్యన ఒక అదిరిపోయే యాక్షన్ సీన్ కూడా ఉంటుందట. ఆ యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్ అంటున్నారు. మరి విలన్ గా ఆది, హీరోగా చరణ్ రంగస్థలంలో ఎలా చెలరేగిపోతారో అనేది సినిమా విడుదల వరకు వెయిట్ చెయ్యాల్సిందే.