సాధారణంగా సినీ సెలబ్రిటీల విషయంలో రూమర్స్ రావడం నిజమే. ముఖ్యంగా సినీ ఫీల్డ్‌లో ఉన్నవారికి అవి నిత్యం ఎదురవుతుంటాయి. ఇక సాయిధరమ్‌తేజ్ వంటి అందరితో కలివిడిగా ఉండే హీరో అంటే ఇక రూమర్స్‌కి అడ్డే ఉండదు. ఆయనపై ఇప్పటికే మీడియా ప్లేబోయ్ ఇమేజ్‌ని వేసింది. దాంతో ఎవరిపైనా రానన్ని గాసిప్స్ ఆయన మీదే వినిపిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు ఆయన మాట్లాడే మాటలు కూడా దానికి కారణం అవుతాయి. నాగచైతన్యతో సమంత వివాహం కొన్నిరోజుల్లో జరుగుతుందనగా ఆయన తనకు సమంత అంటే ఎంతో ఇష్టమని, నాగచైతన్య అడ్డురాకుండా ఉంటే ఆమెని ఎలాగైనా ప్రేమ, పెళ్లికి ఒప్పించేవాడిని అని చెప్పాడు.
ఇక సాయిధరమ్‌తేజ్‌కి 'తిక్క' చిత్రంలో నటించిన విదేశీ మూలాలున్న ముద్దుగుమ్మ లారెన్సీ బొనేసికి మధ్య కూడా ఎఫైర్ నడిచిందని వార్తలు వచ్చాయి. వాటిని ఇద్దరు ఖండించినా కూడా అవి ఆగలేదు. ఇక సాయిదరమ్‌తేజ్‌కి రెజీనాకి మద్య కూడా అవే పుకార్లు షికారు చేశాయి. తాజాగా మరోసారి ఆయనకు మీరు ఓ హీరోయిన్‌ని ప్రేమిస్తున్నారట. ఆమెతో పెళ్లి కూడా అయిందట. ఇంట్లో ఆమె వల్ల గొడవలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. దానిపై మీ సమాధానం ఏమిటి? అని ప్రశ్నిస్తే ఖండించినా కూడా అడిగిందే అడుగుతు, అవే వార్తలు రాస్తున్న మీడియాపై సాయిధరమ్‌తేజ్‌కి చిర్రెత్తుకొచ్చింది.
అవును.. నాకు పెళ్లయింది. ఇద్దరు అమ్మాయిలు కూడా. ఓ పాపకి ఆరేళ్లు...... ఇంకో పాపకి రెండేళ్లు, మా సంసారం సజావుగా సాగుతోంది అంటూ స్పందించాడు. తనపై వస్తున్న రూమర్లని ఖండించినా పదే పదే అవే వార్తలను రాస్తున్నారని, కాబట్టే తాను పదేపదే ఇద్దరు పిల్లలు ఉన్నారని చెబుతున్నానంటే వ్యంగ్యంగానే అయినా సూటిగా తగిలేలా సమాధానం ఇచ్చాడు.
ఎవరు ఎలా రాసుకున్నా తానేం అనబోనని, తనపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయని వ్యాఖ్యానించాడు. అయినా ఒకసారి ఖండించిన తర్వాత పదే పదే అదే రాసి ఆనందం పడటం ఏమిటో అర్దం కాని విషయం.. మొత్తానికి ఈ మెగా హీరో కూడా ఇలాంటి వార్తలకు బాగా అలవాటు పడి లైట్‌గా తీసుకుంటున్నాడనే విషయం అర్ధమవుతోంది.