అఖిల్ - విక్రమ్ కుమార్ ల 'హలో' సినిమా మరో 22 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలున్నాయి. అందులోను 'హలో' టీజర్ విడుదలైనప్పటి నుండి ఈ సినిమా అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే ఇప్పుడు హలో సినిమా ప్రమోషన్స్ కి శ్రీకారం చుడుతున్న టైములో చిత్ర బృందంతో పాటే.. నాగార్జునకి అనుకోని షాక్ తగిలింది. అదేమిటంటే.. అఖిల్ హలో టీజర్ ను యూట్యూబ్ నుండి లేపేసారట. మరి అలా టీజర్ ని యూట్యూబ్ నుండి తీసేయడం అంటే... ఏదైనా కాపీ రైట్ ఇష్యునా అనే అనుమానం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరిలో.
అసలు సడన్ గా ఇలా హలో టీజర్ ని యూట్యూబ్ నుండి తొలగించడానికి నిజంగానే కాపీ రైట్ ఇష్యునే కారణమట. నిజంగా ఇది పరువు పోయే విషయమే. నాగార్జున హలో విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటే.. ఇలా ఎలా జరిగిందబ్బా అని అనుకుంటున్నారంతా. 'హలో' సినిమా డిజిటల్ హక్కులను ఎవరికైనా అమ్మేస్తే వారు ఇలా కాపీ రైట్ వేసారనుకోవడానికి లేదు. ఎందుకంటే హలో డిజిటల్ రైట్స్ ఇంకా నాగ్ ఎవరికీ ఇవ్వనేలేదు. అయితే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వేసిన కాపీ రైట్ తో హలో టీజర్ ని యూట్యూబ్ నుండి లేపలేదట.
అసలు విషయం ఏమంటే.. హలో టీజర్ కోసం అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశాడు అనుకుంటున్న మ్యూజిక్ అనూప్ చెయ్యనేలేదట. అసలు ఫిన్ ల్యాండ్ కు చెందిన ఎపిక్ నార్త్ అనే ఒక కంపెనీ.. టీజర్స్ కోసం ప్రత్యేకించి మ్యూజిక్ తయారు చేస్తారట. వాళ్ళెంతో క్వాలిటీగా.. సూపర్ గా కంపోజ్ చేసే మ్యూజిక్ ని ఎవరైనా కొనుక్కోవచ్చట. అలా కంపోజ్ చేసిన ఎక్సోసూట అనే మ్యూజిక్ ను.. యాజిటీజ్ గా హలో టీజర్ కోసం వాడేసారట. కానీ కాపీరైట్ కోసం డబ్బులు చెల్లించకుండా వాడుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. అందుకే కాపీ రైట్ క్లయిమ్ వేయడంతో.. యుట్యూబ్ లో హలో టీజర్ ఎగిరిపోయింది. మరి అలా వేరే వారి మ్యూజిక్ ని కొనకుండా వాడేయడం నేరమే కదా. అసలు దీనికి నాగార్జున ఎలా ఒప్పుకున్నాడో అర్ధం కానీ విషయం ఇక్కడ.
అయితే హలో హీరో అఖిల్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుండి చిత్ర బృందం వరకు ఈ విషయమై క్లారిటీ ఇస్తున్నట్టుగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. హలో టీజర్ మ్యూజిక్ కు సంబంధించి రియల్లీ స్లో మోషన్ తో తాము కొలాబరేషన్ పెట్టుకున్నామని.... ఆ కంపెనీ వారు సరైన కారణం లేకుండా అనవసరమైన గలాటా సృష్టిస్తున్నారంటూ ఒకింత ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏదైతేనేం మళ్లీ రెండు గంటలలో టీజర్ ని ప్రత్యక్షం అయ్యేలా చేశారు.