ఎవరో నయనతార, శ్రియ, తమన్నా, అనుష్క వంటి వారు తప్ప నేటిరోజుల్లో హీరోయిన్లు అందరూ రెండు మూడేళ్లకే బోర్ కొట్టిస్తూ తిరుగుటపా కట్టేస్తున్నారు. ప్రేక్షకులు కూడా రోజుకో కొత్త అందం, సినిమాకో అందగత్తె కావాలని ఆశపడుతున్నారు. కానీ కాజల్ మాత్రం 50 సినిమాలకు పైగా చేసి పదేళ్లకు పైగా తన కెరీర్‌ని కాపాడుకుంటూ రావడం ఆశ్యర్యమే. ఇక ఈమె తిరుగుటపా కట్టే సమయంలో చిరంజీవితో చేసిన 'ఖైదీనెంబర్ 150', రానాతో నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలు హిట్టయ్యాయి.
అటు యంగ్ స్టార్స్ అయిన రామ్‌చరణ్, ఎన్టీఆర్ నుంచి ఇటు పవన్, చిరంజీవి వంటి వారందరితో రొమాన్స్ పండించింది. ఇక తమిళంలో అజిత్ సరసన చేసిన 'వివేగం' చిత్రం సక్సెస్‌టాక్ రాకపోయినా భారీ కలెక్షన్లు సాధించింది. దాంతో పాటు విజయ్ నటించిన 'మెర్సల్'ద్వారా, దాని డబ్బింగ్ తెలుగు వెర్షన్ 'అదిరింది' ద్వారా బాగానే ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో తమన్నా చేస్తోన్న బాలీవుడ్ రీమేక్ క్వీన్ తమిళ వెర్షన్‌లో టైటిల్ రోల్ పోషిస్తోంది. దీనికి రమేష్ అరవింద్ దర్శకుడు.
తెలుగులో తన మొదటి హీరో కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే', శర్వానంద్-సుధీర్‌వర్మల చిత్రంతో పాటు రవితేజ-శ్రీను వైట్ల చిత్రంలో కూడా ఈమే హీరోయిన్ అని, ఇక వెంకటేష్‌తో తేజ చేసే చిత్రంలో కూడా ఈమెనే పెట్టుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఇలా సీనియర్ స్టార్స్ నుంచి కళ్యాణ్‌రామ్, శర్వానంద్ వరకు ఎవ్వరినీ ఈ చందమామ వదలడం లేదు మరి!