ప్రస్తుతం ఉన్న నిర్మాతల్లో దిల్‌రాజు గురించి, ఆయన జడ్జిమెంట్, ఆయన చిత్రాలు సాధించే విజయాల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇక మెగామేనల్లుడు నేడు ఈ స్థాయిలో ఉన్నాడంటే దిల్‌రాజుతో ఆయనకున్న సాన్నిహిత్యం, ఆయన్ను గాడ్‌ఫాదర్‌గా నమ్మడం, వరుసగా ఆయన చిత్రాలలో నటించడమే కారణమని చెప్పవచ్చు. తన మొదటి చిత్రం 'రేయ్' విడుదలకు నోచుకోకుండా మూలన పడిన సమయంలో సాయిధరమ్‌తేజ్‌ని 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంతో ముందుకొచ్చిన దిల్ రాజు ఆ తర్వాత ఆయన బ్యానర్లో.. 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్' చిత్రాలతో సాయికి హ్యాట్రిక్‌నిచ్చిన ఘనత దిల్‌రాజుకే దక్కుతుంది.
కాగా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మెగామేనల్లుడి పెద మామయ్య మెగాస్టార్ చిరంజీవి దశాబ్దం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మూవీ, ప్రతిష్టాత్మకమైన ఆయన నటించిన 'ఖైదీనెంబర్ 150' చిత్రం విడుదలై అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. అదే సంక్రాంతి పండగకు దిల్‌రాజు నిర్మాణంలో శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' చిత్రం పెద్ద హిట్ కావడమే కాదు.. అవార్డులను, రివార్డులను కూడా గెలుచుకుంది. ఇది శర్వానంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. కాగా మొదటగా శర్వానంద్ స్థానంలో సాయిధరమ్‌తేజ్‌ని పెట్టుకోవాలని దిల్‌రాజు భావించాడట. అంతేకాదు... ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని చెప్పడంతో అదే టైంలో తన మావయ్య 'ఖైదీనెంబర్ 150' రావడం వల్ల ఆయనకు పోటీగా రాకూడదని భావించి సాయి ఆ చిత్రాన్ని చేయనని చెప్పాడట.
అయినా చిరంజీవికి సాయి ఎలా పోటీ అవుతాడా? మహా అయితే చిరు చిత్రం ఓవర్‌ఫ్లోని దక్కించుకుంటాడు. లేదా అంత మంచి సినిమాని వదులుకోకుండా నిర్మాతకు కాస్త ముందుగానో, లేదా తర్వాతనో రిలీజ్ చేయమని కన్విన్స్‌చేయవచ్చు. కానీ సాయి అలా చేయలేదు. బహుశా అది అతని తప్పిదమనే చెప్పాలి. ఆ చిత్రమే చేసుంటే సాయికి మాస్ ఇమేజ్‌తో పాటు ఫ్యామిలీ ఇమేజ్ కూడా దక్కి ఉండేది. ఇక ఆయన ప్రస్తుతం దిల్‌రాజు పర్యవేక్షణలోనే చేస్తున్న 'జవాన్' చిత్రం డిసెంబర్1న విడుదల కానుంది. ఈమద్య కాస్త ఓ మోస్తరు పేరున్న చిత్రాలు వచ్చి చాలా రోజులే అయింది. సో.. ఇది 'జవాన్'కి హెల్ప్ కావచ్చు. ఇక దీనిపై ఉన్న నమ్మకంతోనే ఒక రోజు ముందుగానే మీడియాకు, సినీ ప్రముఖులకు, ఫ్యాన్స్‌కి ప్రీవ్యూలు వేయడానికి రెడీ అయ్యారంటే దిల్‌రాజుకి ఈ సినిమాపై మంచి నమ్మకం ఉన్నట్లే కనిపిస్తోంది.