తెలుగులోనే కాదు సాధారణంగా నటీనటులపై రూమర్స్, ఎఫైర్లు రావడం కొత్తేమీ కాదు. కాకపోతే మెగామేనల్లుడు సాయిదరమ్‌తేజ్ విషయంలో మాత్రం ఇవి ఎక్కువగానే వినిపించాయి. ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ, నేను సింగిల్.. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ లేరు. మా కాలనీలో పెద్దగా అమ్మాయిలు లేరు. అందరూ పెళ్లయిన వారే. ఇక నాకు నేను ఓ అమ్మాయిని గర్ల్‌ఫ్రెండ్‌గా ఎంచుకోవాలంటే..ఆమెని గుర్తించడం చాలా కష్టమైన పనిగా భావిస్తాను అని చెప్పి తనకు ఇంకా 'తొలిప్రేమ' పుట్టలేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు ఆయన ప్రస్తుతం వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.
దీని తర్వాత కె.యస్.రామారావు నిర్మాతగా ప్రేమకధా చిత్రాల స్పెషలిస్ట్, తన చిన్నమామయ్యకి 'తొలిప్రేమ' వంటి మెమరబుల్ హిట్‌ని అందించిన కరుణాకరన్‌తో ఓ చిత్రం చేయనున్నాడు. ఇది 'తొలిప్రేమ' వంటి కథ అని నాడు కరుణాకరన్ చెప్పడంతో అందరూ ఈ చిత్రం 'తొలిప్రేమ'కి రీమేక్‌గా గానీ, లేదా సీక్వెల్‌గా గానీ రూపొందుతోందని భావించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, 'తొలిప్రేమ' అనే టైటిల్‌తో వెంకీ అనే నూతన దర్శకునితో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా వరుణ్‌తేజ్ చేస్తున్న చిత్రం పేరు 'తొలి ప్రేమ'.
ఇక నేను కరుణాకరన్ చేసేది కూడా లవ్‌స్టోరీనే. ఈ చిత్రం లవ్‌స్టోరీ కావడం వల్ల, అందులోనూ కరుణాకరన్ దర్శకుడు కావడం వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయి. ఇది నిజం కాదు. నేను చేసేది సరికొత్త ప్రేమ కథ, 'తొలిప్రేమ'తో ఏమాత్రం సంబంధం ఉండదు. పూర్తి భిన్నంగా, కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చి, అలాంటి వార్తలకు చెక్ పెట్టాడు.