ఈ మధ్యన ఏ ఇండస్ట్రీలో చూసినా మల్టీస్టారర్ సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా రొటీన్ సినిమాల కన్నా మల్టీస్టారర్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఇటు తెలుగులో అప్పట్లో పెద్దగా మల్టీస్టారర్లు మీద ఎక్కువగా ఫోకస్ పెట్టని దర్శకులు ఇప్పుడు మాత్రం మల్టీస్టారర్లు మీద దర్శకులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగానే అనిల్ రావిపూడి ఒక మల్టీస్టారర్ కి ప్లాన్ చెయ్యగా... దర్శకధీరుడు ఏకంగా ఇద్దరు స్టార్ హీరోలైన ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో అదిరిపోయే మల్టీస్టారర్ ని రెడీ చేస్తున్నాడు.
ఇక దర్శకుడు తేజ, వెంకటేష్ చేయబోయే సినిమాలో మరో హీరోకి కూడా స్థానం ఉందట. ఈ పాత్ర కోసం మొదట నారా రోహిత్, మాధవన్, సుమంత్ లాంటి వారిని అనుకున్నారట. కాని ఇప్పుడు లేటెస్ట్ గా ఈ లిస్టు లోకి హీరో రాజశేఖర్ వచ్చి చేరాడు. అవును ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం తేజ.. రాజశేఖర్ ని తీసుకోవాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అని తెలుస్తుంది. మరి రాజశేఖర్ కూడా ఇలాంటి కేరెక్టర్స్ చేస్తానని గతంలో చెప్పాడు.
ఇటీవలే గరుడవేగ సినిమాతో హిట్ అందుకున్న రాజశేఖర్ ని వెంకటేష్ సినిమాలో ఆయనకు బావ పాత్రలో నటించమని దర్శకుడు అడిగినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. నిజానికి తేజ దర్శకత్వం వహించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా రాజశేఖర్ హీరోగా చేయాల్సింది. కానీ అప్పట్లో ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. ఇక రాజశేఖర్ ప్లేస్ లోకి రానా వచ్చి చేరాడు నేనే రాజు నేనే మంత్రిలోకి. మరి ఆ సినిమా హిట్ కూడా అయ్యింది.. అది వేరే సంగతి. ఇకపోతే తన కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన హీరో రాజశేఖర్ ఈ ఛాన్స్ ని ఎంతవరకు ఉపయోగించుకుంటాడో చూడాలి.