Advertisement
Google Ads BL

'అజ్ఞాతవాసి' లుక్‌ అదిరింది కానీ..?


పవన్‌, త్రివిక్రమ్‌ల బంధం ఎంతో బలమైనది. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ మూవీగా తెరకెక్కుతూ, పవన్‌కి ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా 'అజ్ఞాతవాసి' రానుంది. ఈ చిత్రం టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇంతకు ముందు కూడా పవన్‌కి ట్విట్టర్‌ అకౌంట్‌ ఉన్నా వాటిల్లో కేవలం సమాజం, సేవ, తన భావాలు, తాను చేయబోయే పనుల గురించి ట్వీట్స్‌ చేసేవాడే గానీ సినిమాలకి సంబంధించిన విషయాలను అందులో తెలిపేవాడు కాదు. కేవలం సినిమాల గురించి తెలపడానికి ఆయన 'పీకే క్రియేటివ్‌ వర్క్స్‌' పేరుతో ట్విట్టర్‌ అకౌంట్‌ని 'అజ్ఞాతవాసి' ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో ప్రారంభించాడు. ఇందులో రెండో చిత్రంగా కేవలం తనకు ఆత్మీయుడైన త్రివిక్రమ్‌తో ఉన్న ఫొటోని పోస్ట్‌ చేయడం చూస్తే పవన్‌ త్రివిక్రమ్‌కి ఎంతగా విలువిస్తాడో అర్ధమవుతోంది. 

Advertisement
CJ Advs

మరోపక్క ఈ 'అజ్ఞాతవాసి' టైటిల్‌ కింద ట్యాగ్‌లైన్‌గా 'ప్రిన్స్‌ ఇన్‌ ఎక్సైల్‌' అని పెట్టాడు. సో.. ఇందులో కూడా పవన్‌ రిచ్‌మేన్‌గా కనిపిస్తున్నాడని అర్ధమవుతోంది. ఈ చిత్రం భారతంలోని అర్జునుడు, శ్రీకృష్ణుల పాత్రల ప్రేరణతో రూపొందినట్లు కనిపిస్తోంది. ఇందులో కూడా శ్రీకృష్ణుని సలహా మేరకు అర్జునుడిలా దుష్టశక్తులను చాటుగా మట్టుపెట్టే పాత్రగా పవన్‌ క్యారెక్టర్‌ కనిపిస్తోంది. ఇక పవన్‌ గతంలో వచ్చిన చిత్రాలన్నింటినీ గమనిస్తే ఆయన చిత్రాలలో రజనీకాంత్‌- సురేష్‌కృష్ణల కాంబినేషన్‌లో వచ్చిన 'భాషా' చిత్రం టైప్‌ నెరేషనే ఎక్కువగా కనిపిస్తోంది. 'బాలు, పంజా నుంచి 'కాటమరాయుడు' వరకు అదే శైలి. ఈ 'భాషా' తర్వాత తెలుగులో అదే ట్రెండ్‌లో 'సమరసింహారెడ్డి నుంచి సింహాద్రి, ఆది, నరసింహనాయుడు, ఇంద్ర' వంటి ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇది సింపుల్‌కాన్సెప్ట్‌. 

మొదటి భాగంగా హీరో అమాయకుడిలా, ఏమి తెలియని వాడిగా ఉంటాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో ఆయన ఏమిటి? ఆయన ఎలాంటి పవర్‌ఫుల్‌ వ్యక్తి అనేది చూపిస్తారు. చివరకు త్రివిక్రమ్‌ 'అత్తారింటికి దారేది' చిత్రంలో కూడా పవన్‌ని అలాగే చూపించాడు. ఫస్ట్‌హాఫ్‌లో కారుడ్రైవర్‌గా, కట్‌ చేస్తే చార్టెడ్‌ ప్లైట్, జాగ్వార్‌ కారు, ఏకంగా రైల్వే స్టేషన్‌నే ఖాళీ చేయించే స్థాయి హీరోది. సో...మరోసారి ఇదే కాన్సెప్ట్‌తో పవన్‌ రానున్నాడా? అనే అనుమానం కలుగుతోంది. తాను పూర్తిగా రాజకీయాలలోకి రావడానికి ముందు చేస్తున్నచిత్రం కావడంతో కాస్త పొలిటికల్‌టచ్‌, తన పొలిటికల్‌కెరీర్‌కి మైలేజ్‌ని ఇచ్చే సినిమాని పవన్‌ చేస్తాడని పలువురు భావించారు. కానీ పవన్‌ మాత్రం తన రూట్‌ వదలడంలేదని అర్ధమవుతోంది. 

Doubt on Agnyaathavaasi Story:

This is the Agnyaathavaasi Movie Concept
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs