'పెళ్లిచూపులు' సినిమాతో ఒక్కసారిగా నిర్మాత రాజ్ కందుకూరి లైం టైమ్ లోకి వచ్చాడు. 'పెళ్లిచూపులు' సినిమా విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైంది. కానీ సినిమా విడుదలయ్యాక.. సినిమా సూపర్ డూపర్ హిట్ అవడమే కాదు.. దర్శక నిర్మాతలకు కాసులపంటతో పాటే.. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అయితే పెళ్లిచూపులకు ముందు రాజ్ కందుకూరి చిన్న చిన్న ఫైనాన్స్ లు చేస్తూ... కొంతమంది ఆ ఫైనాన్స్ ఎగ్గొట్టేసరికి ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇక పెళ్లిచూపులు నిర్మాతగా మారిన తర్వాత సినిమాలను ఎంత బడ్జెట్ లో నిర్మించి.. హిట్ కొట్టాలో అనే విషయాన్నీ బాగా వంటపండించుకున్నాడు.
అందుకే ఈసారి మళ్ళీ షార్ట్ ఫిలిం డైరెక్టర్ ని తీసుకొచ్చి శ్రీవిష్ణు అనే చిన్న హీరోతో 'మెంటల్ మదిలో' సినిమాని తక్కువ బడ్జెట్ తో నిర్మించాడు. కేవలం అంటే 2.60 కోట్లతో 'మెంటల్ మదిలో' సినిమాని నిర్మించాడు. అయితే సినిమా థియేటర్స్ హక్కులని 1.80 కోట్లకి.. అలాగే శాటిలైట్ హక్కులు, ఇతరత్రా హక్కులను కూడా దాదాపు 1.80 కోట్లకు అమ్మేసి తనఖాతాలో కోటి లాభాన్ని మూటగట్టుకున్నాడు. ఇక చిన్న సినిమాలు నిర్మిస్తూ చిన్నగా ఇండస్ట్రీలో పాతుకుపోతున్నాడు రాజ్ కందుకూరి. ఇప్పటివరకు పెళ్లిచూపులు, మెంటల్ మదిలో చిత్రాలను నిర్మాత దగ్గుబాటి సురేష్ సపోర్ట్ తో క్యాష్ చేసుకున్న రాజ్ కందుకూరి ఇప్పుడు మూడో సినిమాకి ఆ అవసరం రాదేమో.
ఎందుకంటే తీసిన రెండు సినిమాలు వరుసగా మంచి హిట్స్ సాధించడంతో... ఇప్పుడు రాజ్ కందుకూరి నుండి మూడో సినిమా మీద మాత్రం బీభత్సమైన అంచనాలుంటాయి. అందుకే ఈసారి రాజ్ కందుకూరి నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మీద ఉన్న అంచనాలతో మంచి మార్కెట్ జరుగుతుంది. అలా మరో నిర్మాత సినిమా ఇండస్ట్రీలో సెట్ అయ్యాడన్నమాట.