సినిమా ఫీల్డ్‌లో రాణించాలంటే కేవలం బ్యాగ్రౌండ్ ఉంటే చాలదని, టాలెంట్ కూడా ఉండాలంటున్నాడు మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్. ఆయన నటించిన 'జవాన్' డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే టాటా చెబుతారు. నేను కూడా హీరోని కావాలని వచ్చిన క్రమంలో ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం తిరిగి, ఆడిషన్స్‌కి వెళ్లి, నా ఫోటోలను, ఫోన్ నెంబర్లని మేనేజర్లకి ఇచ్చేవాడిని, మా మామయ్యల బ్యాగ్రౌండ్ నేను పెద్దగా వాడుకోలేదు. అలాగే 'కేరింత' చిత్రం ఆడిషన్స్‌కి కూడా వెళ్లాను. అక్కడ నన్ను చూసిన దిల్‌రాజు గారు నీకు ఈ పాత్ర సూట్ కాదు అని చెప్పి 'పిల్లా నువ్వులేని జీవితం' అవకాశం ఇచ్చారు.
బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల కాస్త అదనపు అవకాశాలైతే రావచ్చేమో గానీ కేవలం అది ఒక్కటే సరిపోదు. ఇక అల్లుఅర్జున్ విషయానికి వస్తే ఆయన ఎంతో కష్టపడతాడు. కొత్తగా ఉండాలని ట్రై చేస్తాడు. ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ద తీసుకుంటాడు. చరణ్ విషయానికి వస్తే ఆయన తన తండ్రి ఇమేజ్‌కి భంగం కలగకుండా వ్యవహరిస్తాడు. తనకంటూ ఓన్ ఇమేజ్ కోసం కష్టపడతాడు. దానిని కాపాడుకోవడం కోసం హార్డ్‌వర్క్ చేస్తాడు. ఇక వరుణ్‌తేజ్ ఎంతో సున్నితంగా ఉంటాడు. ఆయన తన చిత్రాలను కూడా అలాగే ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. 'కంచె, ఫిదా'వంటి చిత్రాలు అలాంటివే. ఇక నా సోదరుడు సినిమాలలోకి వస్తాడో లేదో తెలియదు. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వస్తే వస్తాడు.. లేదంటే లేదు.. అని చెప్పుకొచ్చాడు.