Advertisement
Google Ads BL

యంగ్‌ హీరోల చూపంతా ఈ హీరోయిన్ పైనే!


నానితో నటించిన హీరోయిన్లు కొత్తవారైనా సరే ఆ తర్వాత వారి దశ తిరిగిపోవడం గ్యారంటీ అంటారు. ఆయన ఎక్కువగా బిజిగా ఉండే హీరోయిన్లను, దర్శకులను ఎంచుకోడు. తనతో చేసిన వారే ఆ తర్వాత స్టార్స్‌గా మారేలా చేస్తాడు. ఇలా నాని నటించిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' చిత్రంతో తెలుగు తెరకి మెహ్రీన్‌ పరిచయమైంది. ఆ తర్వాత ఆమె నటించిన 'మహానుబావుడు, రాజా ది గ్రేట్‌' చిత్రాలు కూడా హిట్‌ కావడంతో ఆమె లక్కీ హీరోయిన్‌గా, యంగ్‌ హీరోల మెయిన్‌ చాయిస్‌గా మారింది. 

Advertisement
CJ Advs

ఆమె తాజాగా సాయిధరమ్‌తేజ్‌ హీరోగా బి.వి.ఎస్‌.రవి దర్శకత్వంలో నటిస్తున్న 'జవాన్‌' చిత్రంలో నటిస్తోంది. గతంలో ఆమె నటించిన మూడు చిత్రాలలో ఆమెకి పెద్దగా డ్యాన్స్‌, స్టెప్స్‌ వేయాల్సిన అవసరం రాలేదు. కానీ సాయిధరమ్‌తేజ్‌ అంటే ఆయన చిత్రాలలోని పాటలు, వాటికి స్టెప్స్‌ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అదే విషయాన్ని మెహ్రీన్‌ చెబుతూ, ఈ చిత్రంలో నేను డ్యాన్స్‌ బాగా చేయాల్సివచ్చింది. ప్రస్తుతం డ్యాన్స్‌పై కూడా దృష్టి పెట్టాను. ఇక ఈ చిత్రంలో నటించిన సాయిధరమ్‌తేజ్‌ ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఎంజాయ్‌ చేస్తూ ఉంటాడు. ఆయన సీరియస్‌గా ఉండటం ఒక్కసారి కూడా చూడలేదు. ఇక ఈ చిత్రాన్ని 'కృష్ణ గాడి వీరప్రేమగాథ' తర్వాతే ఒప్పుకున్నాను. ప్రస్తుతం గోపీచంద్‌ 25వ చిత్రంలో నటిస్తున్నాను. 

తెలుగులో బిజీగా ఉండటంతో తెలుగుమీదనే దృష్టిపెట్టాను. ఇటీవల నేను నటించిన హిందీ చిత్రం 'ఫిలౌరి' విడుదలైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు నాతో ఫొటోలు తీసుకుంటున్నారు. మీకు తెలుగు తెలుసా? అని అడిగితే మీ 'ఫిలౌరి' చూశామని చెబుతున్నారు. ఈ చిత్రం అంతగా ప్రేక్షకులకు చేరువవుతుందని ఊహించలేదు అని చెప్పుకొచ్చింది. ఇక ఆమె నటించిన 'రాజా ది గ్రేట్‌' నిర్మాత దిల్‌రాజు కూడా ఈ 'జవాన్‌'లో భాగస్వామిగా ఉండటంతో ఈ చిత్రంతో ఆమె సెకండ్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం చుడుతుందేమో చూద్దాం..! 

Mehreen Pirzada is the Heroes First Choice:

Mehreen Pirzada Busy with Telugu Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs