చాలా గ్యాప్ తర్వాత హీరో సిద్దార్ధ సూపర్ హిట్ కొట్టాడు. అటు తమిళం ఇటు తెలుగు, హిందీలో ఒకే హర్రర్ ఫిల్మ్ తో దూసుకుపోయాడు. హార్రర్ థ్రిల్లర్ చూపిస్తానని చెప్పిన సిద్దార్థ్ ఆ మాటను నిలబెట్టుకున్నాడు. సిద్దార్దే హీరోగా నటిస్తూ... నిర్మించిన ‘గృహం’ సినిమా చూసిన వాళ్లందరూ సూపర్ అంటున్నారు. అంతే కాకుండా ఇండియాలో వచ్చిన బెస్ట్ హార్రర్ సినిమాల్లో ఇదొకటని కూడా అంటున్నారు. అసలు ఈ చిత్రాన్ని సిద్దు తమిళంలో నిర్మించి అక్కడ విడుదల చేశాడు. అలాగే తమిళంతోపాటే తెలుగులోనూ ఒకేసారి విడుదల చేద్దామనుకుంటే థియేటర్స్ సమస్యల వల్ల తెలుగులో ఆలస్యంగా విడుదల చేయాల్సి వచ్చింది.
అయితే తమిళంలో ‘అవల్’ పేరుతో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్టయింది. అక్కడ ఈ సినిమా దాదాపు 15 కోట్లకు పైగా వసూలు చేసిందీ. ఇక హిందీలో ‘హౌస్ నెక్స్ట్ డోర్’ పేరుతో విడుదలై అక్కడా కూడా పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇక తెలుగులో ఆలస్యంగా ఏడెనిమిది సినిమాల పోటీ మధ్య... అందులోను హీరో కార్తీ నటించిన 'ఖాకి' సినిమాకి పోటీగా ‘గృహం’ పేరుతో రిలీజైన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. విడుదలైన ఏడెనిమిది సినిమాల్లోనూ కార్తీ 'ఖాకి', సిద్దు 'గృహం' సినిమాలే హిట్ అయ్యాయి.
ఇక 'ఖాకి' సినిమా కూడా వీకెండ్ గడిచే నాటికీ కలెక్షన్స్ పడిపోయినా 'గృహం' మాత్రం స్టడీగా నిలబడి హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఈ సినిమా మల్టిప్లెక్స్ లో ఇంకా రన్ అవుతుంది.. అంటేనే ఈ సినిమాపై ఉన్న ఆదరణ అర్ధమవుతుంది. మరి సిద్దార్థ్ చాలా ఏళ్ల తర్వాత ఇలా తెలుగు, తమిళంలో కావాల్సిన హిట్ కొట్టి హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయాడు. మరి మీడియం బడ్జెట్ తో తీసిన ఈ సినిమాతో సిద్దార్థ్ మాత్రం భారీ లాభాలే పొందాడని తెలుస్తుంది.