ఇండియన్ సినీ చరిత్రలోనే 50ఏళ్లుగా అతిలోక సుందరి ఇమేజ్‌ని మెయిన్‌టెయిన్ చేయడం సామాన్యమైన విషయం కాదు. ఈరోజుల్లో హీరోయిన్లు రెండుమూడేళ్లకే తెరమరుగవుతున్నారు. కానీ హీరోలు మాత్రం హీరోయిన్లతో వారి పిల్లలతో కూడా కలిసి నటిస్తున్నారు. ఈ ఫీట్‌ని తిరగరాసిన నటి శ్రీదేవి మాత్రమే. ఆమె తండ్రులతోపాటు కుమారులతో కూడా ఎన్నో చిత్రాలలో జతకట్టింది. ఇక ఈమె మంచి డ్రస్‌లో తన ఇద్దరు కూతుర్ల పక్కపక్కన నిలబడితే వారికి ఈమె అమ్మా, లేక అక్కా అనే సందేహం రావడం ఖాయం. ఇద్దరు కూతుర్లు ఉన్నా ఆ వేడుకలకి వచ్చేవారి చూపులే కాదు.. మీడియా అటెన్షన్ కూడా శ్రీదేవి మీదనే ఉంటుంది.
కాగా శ్రీదేవికి దక్కిన ఓ అరుదైన గౌరవం తాజాగా వెలుగులోకి వచ్చింది. సింగపూర్‌లో ఉండే ఓ రెస్టారెంట్ యజమాని శ్రీదేవికి వీరాభిమాని. దాంతో ఆయన ఆమెలాగే ఉన్న ఓ మైనపు విగ్రహాన్ని తయారు చేయించి తన రెస్టారెంట్‌లో పెట్టుకున్నాడు. ఈ రెస్టారెంట్‌కి వచ్చే అతిథులకి మిగతా అన్నింటి కంటే శ్రీదేవి బొమ్మే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిపై శ్రీదేవి భర్త బోనీకపూర్ మాట్లాడుతూ, శ్రీదేవికి దేశంలోనే కాదు.. విదేశాలలో కూడా ఎంతటి క్రేజ్, ఇమేజ్ ఉన్నాయో తెలపడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ఇది ఆమెకి దక్కిన అరుదైన గౌరవం అని అభివర్ణించాడు.
ఇక ఈ విషయంపై శ్రీదేవి మాట్లాడుతూ, ఈ మాట విన్నప్పుడు నాకు నోట మాటరాలేదు. నన్ను ఎంత స్వీట్‌గా వాడుకుంటున్నారో చూస్తుంటే ఆనందం వేస్తోంది. గత 50ఏళ్లుగా ప్రేక్షకులు నా మీద చూపిస్తున్న అభిమానానికి ఇది నిలువెత్తు నిదర్శనం అని సంతోషపడిపోతూ చెబుతోంది. బహుశా ఈ విషయం రాంగోపాల్‌వర్మకి తెలిస్తే జీవితాంతం ఆయన అదే రెస్టారెంట్‌లో శ్రీదేవి విగ్రహం ముందే గడిపేసినా ఆశ్యర్యం లేదు..!