సై రా సినిమా సెట్స్ మీదకి రాకముందే ఆ సినిమా నుండి టాప్ టెక్నీషియన్స్ అయిన సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని సై రా చిత్ర బృందం బయటికి రాకుండా జాగ్రత్త పడినా.. ప్రయోజనం లేకుండా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇంకా సై రా నుండి క్లారిటీ రాకముందే రవి వర్మన్ స్థానంలోకి రత్నవేలుని తీసేసుకున్నారు సై రా నిర్మాత చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి లు. అలాగే ఏ ఆర్ రెహ్మాన్ స్థానంలోకి కూడా ఎవరో ఒకరిని సెట్ చేద్దామనుకుంటే... నేషనల్ వైడ్ గా మరో మ్యూజిక్ డైరెక్టర్ వారికి కనబడక ఇంకా తికమకలో ఉండగా... ఈలోపు రెహ్మాన్ సై రా నుండి తప్పుకున్నట్టు ఓపెన్ అయ్యాడు.
అయితే రెహ్మాన్ తప్పుకోవడానికి కారణం రెహ్మాన్ వెర్షన్ అయితే తనకి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణంగానే ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్లు... సై రా నుండి బయటికి రావడం బాధాకరం అంటున్నాడు. కానీ బయట మాత్రం రెహ్మాన్ కి సై రా ఇచ్చిన ఆఫర్ నచ్చకే ఈ సినిమానుండి తప్పుకున్నాడని ప్రచారం వుంది. ఏదిఏమైనా నేషనల్ వైడ్ గా సై రా ని ఎక్కడో కూర్చోబెడదామనుకుంటే.. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఉంది రెహ్మాన్ తప్పుకోవడం. ఇకపోతే రెహ్మాన్ స్థానంలోకి సంగీత దర్శకుడిగా సై రా లోకి అడుగుపెట్టే వారెవరు?
అయితే సై రా మోషన్ పోస్టర్ చేసిన ఎస్ ఎస్ థమన్ కి ఛాన్స్ తగలొచ్చనే టాక్ ఉంది. మరోవైపు థమన్ ని తీసుకుంటే.. ఈ సినిమాకి హైప్ క్రియేట్ అవుతుందా లేదా అనే డైలమాలో దర్శక నిర్మాతలు ఉన్నారనే టాక్ వుంది. అయితే థమన్ మాత్రం అటు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో సత్తా చాటుతున్నాడు. ఇక సై రా కి మ్యూజిక్ డైరెక్టరు గా థమన్ తప్ప వేరే ఆప్షన్ కూడా కనబడడం లేదు. మరి రెహ్మాన్ తప్పుకోవడం థమన్ కి కలిసొచ్చేలాగే కనబడుతుంది.