Advertisement
Google Ads BL

పవన్ సినిమానే కీర్తి సురేష్ కి మొదటిది!


మన తెలుగు వారికి, ఎంతో కాలంగా ఇక్కడే ఉంటున్న వారికి మాత్రం తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం రావడం లేదు. కానీ పరభాషా హీరోయిన్లు ఎంతో శ్రద్దతో తెలుగును నేర్చుకుని తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకుంటూ భేష్‌ అనిపిస్తున్నారు. నిజానికి పరిపూర్ణ నటులు అంటే అది కేవలం నటన, హావభావాలే కాదు.. స్వంతగా ఎమోషన్స్‌కి తగ్గట్లు డైలాగ్‌లు చెప్పుకునే వారే నిజమైన నటీనటులు. ఇక చార్మి, తమన్నా, రకుల్‌ప్రీత్‌సింగ్‌ నుంచి సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్‌ వరకు సొంతగా తమ డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. ఈ కోవలోకి ఇప్పుడు కీర్తిసురేష్‌ కూడా వచ్చి చేరింది. 

Advertisement
CJ Advs

ఆమె ప్రస్తుతం తెలుగులో పవన్‌-త్రివిక్రమ్‌ల చిత్రంతో పాటు సావిత్రి బయోపిక్‌ 'మహానటి'లో కూడా నటిస్తోంది. మరోవైపు ఆమె సూర్య-విఘ్నేశ్‌ శివన్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో కూడా నటిస్తోంది. పవన్‌ చిత్రంతో పాటు సూర్య చిత్రం కూడా సంక్రాంతికే విడుదల కానున్నాయి. ఇక కీర్తిసురేష్‌ 'అజ్ఞాతవాసి' కోసం తానే స్వంతంగా డబ్బింగ్‌ చెప్పుకున్నానని, విజయవంతంగా పూర్తయింది. ఎంతో సంతోషంగా ఉన్నానని చెబుతూ డబ్బింగ్‌ థియేటర్‌లో ఆమె దిగిన ఫోటోని కూడా పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలో స్క్రీన్‌పై పవన్‌, కీర్తిసురేష్‌లు ఉండగా ఎదురుగా మరో ఆవిడ నిలుచుని ఉంది. 

కాగా గతంలో 'నేను...శైలజ' చిత్రంతో జనవరిలో కీర్తిసురేష్‌ హిట్‌ కొట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి పవన్‌, సూర్యల చిత్రాలతో మరో రెండు హిట్టు కొట్టి తెలుగులో సంక్రాంతి భామగా సెంటిమెంట్‌ని సాధిస్తుందో లేదో చూడాలి...! మరోవైపు ఈమె నటిస్తున్న సావిత్రి బయోపిక్‌ 'మహానటి'లో సావిత్రి పాత్రకు డబ్బింగ్‌ చెప్పడమంటే సామాన్యం కాదు. మరి దానిని కూడా కీర్తి చేసి చూపిస్తుందా? లేదా? అనేది వెయిట్‌ చేయాల్సివుంది...! 

Keerthi Suresh Own Dubbing for PSPK 25th Film:

Keerthi Suresh another Talent Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs