Advertisement
Google Ads BL

'సాహో'కి బాలీవుడ్ కష్టాలు..!


బాహుబలి సినిమా బాలీవుడ్ ని అల్లాడించింది అంటే.. దాని వెనుక బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ ఉన్నాడు. అతని హ్యాండ్ వలెనే బాహుబలి సినిమా బాలీవుడ్ లో భారీ స్థాయిలో విడుదలవడమే కాదు బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది. అయితే బాహుబలిని కరణ్ జోహార్ వంటి మేకర్ కి అప్పజెప్పడంలో భల్లాలదేవుడు రానా ప్రముఖ పాత్ర పోషించాడని బాహుబలి దర్శకుడు రాజమౌళే స్వయంగా చెప్పాడు. ఏదిఏమైనా బాహుబలి బాలీవుడ్ లో అంతటి ఘనవిజయం సాధించడానికి కరణ్ జోహార్ హెల్ప్ కారణం. అలాగే బాలీవుడ్ లో ప్రభాస్ కి ఆయా నటులకు పేరు ప్రతిష్టలు రావడానికి కూడా పరోక్షంగా కరణ్ కారణమయ్యాడు.

Advertisement
CJ Advs

బాహుబలితో ప్రభాస్ మార్కెట్ బాలీవుడ్ లోను పెరిగిపోయింది. అందుకే ప్రభాస్ తో బాలీవుడ్ లో ఒక సినిమా చెయ్యాలనుకున్నాడు కరణ్ జోహార్. కానీ ప్రభాస్ ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగాడని కరణ్, ప్రభాస్ బాలీవుడ్ సినిమాని పక్కనపడేశాడనే టాక్ నడిచింది. అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం కూడా ఇండియన్ వైడ్ గా రూపుదిద్దుకుంటుంది. మరి సాహో సినిమాకి కూడా ప్రభాస్, కరణ్ సాయం తీసుకుందామని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ రెమ్యూనరేషన్ విషయంలో తలెత్తిన వివాదంతో సాహో హిందీ వెర్షన్‌ని మార్కెట్‌ చేసేదెవరనే ప్రశ్న తలెత్తింది. 

కాకపోతే ప్రభాస్ కున్న స్టార్ వాల్యూతో చాలా హిందీ సంస్థలు ఈ చిత్రం రైట్స్‌ తీసుకోవడానికి సిద్ధంగా వున్నాయి. కానీ ఆయా సంస్థలు కరణ్‌ జోహార్‌ మాదిరిగా సాహోకి ప్రచారం కల్పించగలరా? అలాగే మీడియాతో సాహో ని ఇంటరాక్ట్ చెయ్యగలరా? అనే ఆలోచనతో పాటే... అసలు సాహో హిందీ రైట్స్ చేతుల్లోకి వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరి సాహో చిత్రం ట్రైలర్ ఏదైనా బయటకి వస్తే ఆటోమేటిగ్గా హైప్‌ క్రియేట్‌ అవుతుందనేది మేకర్స్‌ ధీమాగా కనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో? 

Who Promotes Saaho in Bollywood?:

Saaho Faces Bollywood Promotion Problems 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs