తాజాగా 'జబర్దస్త్'షోలో అనాధపిల్లల మీద హైపర్ ఆది స్కిట్ చేయడం, దానికి యాంకర్ అనసూయమ్మ, రోజా, నాగబాబులు పగలబడి నవ్వడం తీవ్రదుమారం రేగుతోంది. దీనిపై స్పందించిన అనసూయ తెలుగు సినిమాకి 'బాహుబలి'ఎలాగో, బుల్లితెర ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో 'బాహుబలి' వంటిది 'జబర్దస్త్' అని పేర్కొంది. ఇక ఈ షో కోసం నాగబాబు, రోజాలు ఎంతో కష్టపడుతున్నారు. అనాధ ఆశ్రమానికి వెళ్లిన సందర్భంలో లీడ్ కోసం రాసుకున్న డైలాగ్స్ అవి. సమస్యల గురించి ఆలోచిస్తే క్రియేటివిటీ పోతుంది. హాస్యాన్ని హాస్యంగానే చూడాలి. తెరపై కనిపించేదంతా కేవలం కల్పితం. ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు. మేము నిజజీవితంలో కూడా నటిస్తున్నామని భావించవద్దు. సమస్యల గురించి మాట్లాడాల్సివస్తే మహిళలపై అత్యాచారాలు, విద్య, వైద్యం, విద్యుత్తు.. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా 'జబర్దస్త్'ని హైలైట్ చేయడం ఏం పని? మేమే మీకు కనిపిస్తున్నామా? అని మండిపడింది.
ఇక ఓ నెటిజన్ 'అనసూయ ఆంటీ' అని సంబోధిస్తే ఆమె కోపం నషాళానికి అంటింది. నా పిల్లల ఫ్రెండ్స్ నన్ను ఆంటీ అంటే ఒప్పుకుంటాను గానీ గడ్డాలు, మీసాలు వచ్చిన అంకుల్స్ వంటి మీరు నన్ను ఆంటీగా పిలిస్తే ఒప్పుకోనని వార్నింగ్ ఇచ్చింది. మరో నెటిజన్ నన్ను రెండో పెళ్లి చేసుకో అనసూయ అని అడిగితే చస్తే చేసుకోను. ఈ జన్మలోనే కాదు.. ఎన్ని జన్మలెత్తినా నా భర్తనే వివాహం చేసుకుంటానని సమాధానం ఇచ్చింది. ఇక నెగటివ్ కామెంట్స్, పోస్ట్‌లు పెట్టేవారిని బ్లాక్ చేస్తాను.
హాస్యం, అసభ్యత గురించి మాట్లాడితే విపరీతార్ధాలు తీస్తున్నారు. అసభ్యత గురించి మాట్లాడితే ముందు సరిగా బట్టలు వేసుకో అంటున్నారు. కామెడీ గురించి మాట్లాడితే 'అర్జున్‌రెడ్డి' అంటున్నారు. అలాంటి వారినందరినీ బ్లాక్ చేస్తానంటోంది. అయినా ఈమె చెప్పే నీతులు ఎవరో చెవిలో పువ్వులు పెట్టుకునే వారికి చెబితే మంచింది. అందరికీ ఉచిత సలహాలు ఇస్తూ.. తాను మాత్రం అదే దారిలో నడిచే ఆమెనే అందరు బ్లాక్ చేస్తే పీడ విరగడ అవుతుంది...!