ఒకపక్క చేతిలో సరైన హిట్ లేక మరోపక్క అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ భామ ఇటీవల కొన్ని సమస్యల్లో ఇరుక్కుని ఏకంగా ఫైన్ కట్టే పరిస్థితికి వెళ్లిందని ప్రచారం బాగా జరిగింది. తమిళంలో జి.వి ప్రకాష్ హీరోగా సుకుమార్ అసిస్టెంట్ '100% కాదల్' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ సినిమాలో ముందు లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా ఎంపిక చేసి స్క్రిప్ట్ లాక్ చేసి.. సినిమా సెట్స్ మీదకెళ్ళబోతున్న సమయంలో లావణ్య త్రిపాఠి ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో... తమకి లావణ్య వలన ఐదు కోట్ల నష్టం వచ్చిందని దర్శకనిర్మాతలు తమిళ నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేశారు.
అంతేకాకుండా ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్‌లో సినిమా వదులుకుందని ఇలా రకరకాల కథనాలు వినిపించాయి. అయితే వాటిలో నిజానిజాలేంటో ఎవరికీ సరైన క్లారిటీ లేదు. కానీ లావణ్యకి పొగరెక్కువైందనే ప్రచారం మాత్రం గట్టిగా జరిగింది. అయితే మీడియా వాళ్ళు అసలు నిజానిజాలేంటో తెలుసుకోకుండా తనపై అవాకులు చవాకులు పేలారని తాజాగా లావణ్య ఒక ఇంగ్లిష్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యింది. '100% కాదల్' లో నటించాల్సి ఉన్నా.... కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తప్పుకున్నా, అంతేకాని వారినుండి నేను 3 కోట్లు తీసుకున్నానంటూ రూమర్లు ఎలా పుట్టుకొచ్చాయో తెలీదు.
అలాగే గీతాఆర్ట్స్ సినిమా విషయంలోనూ అదే జరిగింది. విజయ్ దేవరకొండ సరసన గీతాఆర్ట్స్ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ కాల్షీట్ల సమస్య తలెత్తి ఆ సినిమా వదులుకున్నా. అయినా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి వెళుతుంటాయి. అంతేగాని నేనెవరిని మోసం చెయ్యలేదు. అయినా నాకు నచ్చిన కథలు వస్తేనే సినిమాలు చేస్తాను. ఏది పడితే అది చేయాల్సిన అవసరం నాకు లేదని ఘాటుగా స్పందించింది ఈ అమ్మడు.