Advertisement
Google Ads BL

సై రా రికార్డులు మొదలైనాయ్!


చిరంజీవి 151 వ చిత్రం  సై రా నరసింహారెడ్డి సినిమా అసలు మొదలవ్వకముందే అనేక సంచలనాలకు నెలవుగా మారింది. సినిమా సెట్స్ మీదకెళ్ళకముందే రికార్డుల మోత మోగిస్తుంది. రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సై రా నరసింహారెడ్డి ప్రస్తుతం టెస్ట్ షూట్ పూర్తి చేసుకుని డిసెంబర్ ఆరు నుండి సెట్స్ మీదకెళ్లబోతుంది. ఈ సినిమా దేశంలో వివిధ భాషల్లో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమాపై అంచనాలు కూడా పీక్స్ లో ఉన్నాయి. ఇప్పటికే సై రా సినిమా డిజిటల్ హక్కులను ప్రమఖ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ సంస్థ భారీ ధరకు దక్కించుకుందనే ప్రచారం జరుగుతుంది. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు సై రా నరసింహారెడ్డి ఆడియో హక్కుల విషయంలో కూడా తీవ్రమైన పోటీ నెలకొందని సోషల్ మీడియా సాక్షిగా వినబడుతుంది. సై రా ఆడియో హక్కుల కోసం ప్రముఖ ఆడియో సంస్థలు పోటీ పడుతున్నాయట. అందులో లహరి మ్యూజిక్, ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు సై రా ఆడియో కోసం పోటీపడిన వాళ్లలో ఉన్నారట. అందులో లహరి సంస్థ సై రా ఆడియో కోసం పోటీపడి అధిక మొత్తానికి చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. ఆదిత్య మ్యూజిక్ వారు 2.40 కోట్లకు కోడ్ చెయ్యగా.. లహరి మ్యూజిక్ వాళ్ళు 2.90 కోట్లకు ఆడియో హక్కులు దక్కించుకున్నారని టాక్.

మరి డిజిటల్ హక్కుల విషయంలోనే సై రా రికార్డులు సృష్టిస్తే... ఇపుడు సై రా ఆడియో హక్కుల విషయంలోనూ కొత్త రికార్డులను నమోదు చేసేలా కనబడుతుంది. మరి సినిమా సెట్స్ మీదకెళ్ళకముందే.. సై రా రికార్డులు ఈ రేంజ్లో కనబడుతుంటే... ఒకవేళ సెట్స్ మీదకెళ్లాక ఆ మేకింగ్ చూశాక మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Sye Raa Narasimha Reddy Audio Rights Record :

Sensational Offer to Sye Raa Audio Rights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs