టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఇప్పుడు మూడు సినిమాలు తెరకెక్కించడానికి రెడీగా ఉన్నారు. అందుకుగాను దర్శకులను కూడా అప్పుడే సెట్ చేసేసారు వారు. ఒక సినిమా సుధీర వర్మ తో చెయ్యాలని, మరొక సినిమా మారుతీ దర్శకత్వంలోను, మూడోది నందిని రెడ్డి తో చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. అయితే అందులో మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా సినిమా పూజ కార్యక్రమాలతో మొదలైపోగా.. మరో దర్శకుడు సుధీర్ వర్మ సినిమా మొదలు కావాల్సి ఉంది.
సుధీర్ వర్మ దర్శకుడిగా శర్వానంద్ హీరోగా ఒక సినిమాకి సంబందించిన కథా చర్చలు పూర్తయ్యాయి.... సినిమా సెట్స్ మీదకెళుతుంది అనుకున్నాక.. కథలోని చిన్న చిన్న మార్పుల వలన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగలేదు. ఈ మధ్యలో శర్వానంద్, హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమాని మొదలెట్టేశాడు. అలా శర్వానంద్, హనుతో సినిమా మొదలెట్టేసరికి సుధీరవర్మతో శర్వానంద్ సినిమా ఆగిపోయిందనుకునే అవకాశం ఎక్కువ ఉండడంతో ఇప్పుడు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ సినిమా కి కూడా పూజ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారట.
సుధీర్ వర్మ - శర్వానంద్ ల కలయికలో తెరకెక్కబోయే సినిమాకి కూడా ఈ 27 వ తేదీ అంటే రేపు సోమవారమే పూజ కార్యక్రమాలు జరిపించేసి అధికారికంగా సినిమాని లైన్ లో పెట్టేస్తున్నారు. ఇక సినిమాకి పూజ జరిగిపోతే.. సినిమా ఎప్పుడు పట్టాలెక్కిన ప్రాబ్లెమ్ ఉండదని.. ఈ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక హనుకి డేట్స్ అడ్జెస్ట్ చేసి సుధీర్ సినిమా కూడా శర్వా చేసేస్తాడట. ఇక మూడో సినిమా నందిని రెడ్డితో తెరకెక్కించాల్సి ఉండగా. దానికి సబ్జెక్టు గాని హీరోకాని సెట్ కాలేదట. సో హారిక అండ్ హాసిని వాళ్ళు ప్రస్తుతం రెండు సినిమాల్తో బిజీగా వున్నారన్నమాట.