Advertisement
Google Ads BL

'సై రా' గురించి రెహమాన్ క్లారిటీ ఇచ్చేశాడు!


చిరు 151 వ చిత్రం 'సై రా నరసింహారెడ్డి'ని  దేశవ్యాప్తంగా విడుదల చేసి కోట్లు కొల్లగొట్టాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా సురేందర్ రెడ్డి దర్శకుడిగా ఈ సై రా సినిమాని ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. డిసెంబర్ 6 న షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతున్న ఈ సినిమాని నేషనల్ వైడ్ గా పాపులర్ చేసేందుకు మెగా ఫ్యామిలీ ఎంతగానో శ్రమ పడుతుంది. అందులో భాగంగానే ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ ని తీసుకోనున్నారు. అంతేకాకుండా ఇండియా వైడ్ గా టాప్ స్టార్స్ కి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

ఇకపోతే  ఆస్కార్ అవార్డు విజేత అయిన ఏ.ఆర్. రెహమాన్ ను ఈ ప్రాజెక్టులోకి సంగీత దర్శకుడిగా ఎంపిక చెయ్యడమే కాదు అధికారికంగా సై రా మోషన్ పోస్టర్ లో రెహ్మాన్ పేరు ఎనౌన్స్ చేశారు.  రెహ్మాన్ రాకతో సినిమా స్థాయి కూడా వెయ్యి రేట్లు పెరిగింది. కానీ.. సై రా సినిమా మొదలైన నెలరోజులకు ఈ సినిమా నుండి ఏ ఆర్ రెహ్మాన్ తప్పుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్నీ మెగా ఫ్యామిలీ గాని, సై రా చిత్ర బృందం గాని ఎక్కడా కన్ఫర్మ్ చెయ్యలేదు. కానీ రెహ్మాన్ సై రా నుండి తప్పుకున్నట్టుగా గట్టిగానే ప్రచారం జరిగింది. అయితే ఇపుడు ఇదే విషయంపై తాజాగా రెహమాన్ స్పందించాడు. ఒక కన్సర్ట్ కోసం హైదరబాద్ వచ్చిన ఏ.ఆర్. రెహమాన్ మీడియాతో  సై రా నరసింహారెడ్డి సినిమాను తాను చేయడంలేదని వెల్లడించాడు.

రెహ్మాన్ తెలుగు మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిగారు నా అభిమాన హీరో. ఆయన సినిమాకు పనిచేయాలని ఎన్నాళ్లుగానో అనుకుంటున్నాను. కానీ బిజీ షెడ్యూల్ వలన సై రా సినిమా నుంచి తప్పుకున్నాను. అంత మంచి ప్రాజెక్ట్ చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నాను అని స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. మరి  ఏ ఆర్ రెహ్మాన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ తో సై రా కి మ్యూజిక్ డైరెక్టర్ గా లేడని అర్ధం అయిపోయింది అందరికి. మరి ఇప్పుడు సై రా కోసం ఎస్ ఎస్ థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటారో? లేదో అనేది తెలియాల్సి ఉంది. 

Oscar Winner Rahman Is Fan of Mega Star:

Rahman interacting with the scribes in Hydeabad ahead of his concert said Mega Star Chiranjeevi is his favourite star.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs