Advertisement
Google Ads BL

'సై..రా'కి సపోర్ట్‌ చేస్తోన్న 'తమ్ముడు'!


వాస్తవానికి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు కలిసి ఓ సినిమా చేస్తే అభిమానుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. కానీ వీరిద్దరు పూర్తి స్థాయి నిడివి ఉన్న చిత్రాలను కలిసి చేయకపోవడం మెగాభిమానులకు కాస్త లోటేనని చెప్పాలి. ఇక చిరంజీవి నటించిన 'శంకర్‌దాదా' సీరిస్‌లో పవన్‌ అలా తళుక్కుమని మెరిశాడు. ఆ ఒక్క సీన్‌ని చూసిన మెగాభిమానులు మాకు ఇదే చాలనుకున్నారు. కానీ ఈ కనుల విందుని మరోసారి అభిమానులకు, ప్రేక్షకులకు అందించడానికి ఈ మెగాస్టార్‌, పవర్‌స్టార్‌లు సిద్దమవుతున్నారని సమాచారం. 

Advertisement
CJ Advs

చిరంజీవి త్వరలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ షూటింగ్‌ని మొదలు పెట్టనున్నాడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రలో ఎన్నో విశేషాలు, ఎందరో ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. దాంతో ఈ చారిత్రక చిత్రంలో ఇప్పటికే అమితాబ్‌బచ్చన్‌, జగపతిబాబు, విజయ్‌సేతుపతి వంటి వారిని తీసుకున్నారు. కానీ అంత పెద్ద బయోపిక్‌లో పాత్రలకు కొదువే లేదు. ఉయ్యాలవాడ జీవితంలో మరొక పవర్‌ఫుల్‌ పాత్ర కూడా ఓ పది పదిహేను నిమిషాల నిడివిలో ఉంటుందని తెలుస్తోంది. సో.. ఈ పాత్రను మొదట విక్టరీ వెంకటేష్‌ చేత చేయించాలని భావించారు. కానీ అది వర్కౌట్‌కాలేదు. దాంతో చిరు, సురేందర్‌రెడ్డి, రామ్‌చరణ్‌లు పవన్‌ని అడగటం, ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయాయని తెలుస్తోంది.

పవన్‌ చారిత్రక చిత్రాలు పట్ల, మహామహుల విశేషాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాడు. అందునా తనకు అన్నయ్యంటే ప్రాణం. ఇక రామ్‌చరణ్‌తో ఓ చిత్రం చేయాలనుకుంటున్నానని పవన్‌ చెప్పాడు. దానిని బట్టే ఆయనకు చరణ్‌పై ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతోంది. సో.. ఈ చిత్రంలో అన్నయ్య నటిస్తుండటం, చరణ్‌ నిర్మాతగా, తమ కొణిదెలబేనర్‌లో రూపొందుతున్న చిత్రంకావడంతో పవన్‌ కూడా సంతోషంగా ఒప్పుకున్నాడట. ఎంతపొలిటికల్‌గా బిజీ అయినా కేవలం 10 నిమిషాల పాత్రే కాబట్టి చేయడానికి ఆస్కారం  కూడా ఉంది. సో... మొత్తానికి 'సై..రా...నరసింహారెడ్డి' చిత్రం వపన్‌కి 26వ చిత్రం కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Pawan Kalyan in Chiranjeevi Sye Raa Narasimha Reddy Movie:

Pawan Kalyan Guest Role in Sye Raa Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs