Advertisement
Google Ads BL

అల్లరోడిని ఆ సుడిగాలే కాపాడాలి!


మొదటి నుంచి అల్లరి నరేష్‌ మినిమం గ్యారంటీ హీరో అనే గుడ్‌విల్‌ దర్శకులకు, నిర్మాతలకు ఉండేది. ఇక సినిమా ఎలా ఉన్నా కూడా కామెడీతో మెప్పించి కాస్త ప్రేక్షకులను రిలాక్స్‌ చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. రాజేంద్రప్రసాద్‌, సీనియర్‌ నరేష్‌, చంద్రమోహన్‌ వంటి వారి బెర్త్‌ని కైవసం చేసుకున్నాడు. అదే సమయంలో 'గమ్యం, లడ్డూబాబు' వంటి చిత్రాలలో కూడా నటించాడు. ఇక ఆయనకు చివరగా వచ్చిన హిట్‌ 'సుడిగాడు'. నాడు స్పూఫ్‌లు, పేరడీలు, కామెడీ పంచ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. దాంతో ఈ చిత్రం ఆరేళ్ల కిందటే ఏకంగా 15కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్‌ పండితులను ఆశ్చర్యపరిచింది. అల్లరోడు స్థాయికి ఇది బ్లాక్‌బస్టర్‌ కింద లెక్క. అయితే ఆ సినిమా అల్లరోడికి ఎంత హెల్ప్‌ చేసిందో... అంతగా బ్యాడ్‌లక్‌ని కూడా తీసుకొచ్చింది. 

Advertisement
CJ Advs

అప్పటివరకు తన చిత్రాలలో కొన్ని సీన్స్‌లో పేరడీ చేసేవాడు. కానీ తమిళ చిత్రం 'తమిళపడం'కి రీమేక్‌గా రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్‌ భీమినేని శ్రీనివాసరావు, అల్లరి నరేష్‌లు ఈ చిత్రంతో ఒక్క టిక్కెట్‌పై 100 చిత్రాల స్ఫూఫ్‌లను అందించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారింది. 'జబర్దస్త్‌లు, పటాస్‌', చలాకీ చంటీ, హైపర్‌ ఆదిల ద్వారా ప్రేక్షకులకు బుల్లితెరపైనే ఉచితంగా వినోదం అందుతోంది. ఇక ఇప్పుడు 'సుడిగాడు' తమిళ ఒరిజినల్‌ 'తమిళపడం'కి సీక్వేల్‌గా 'తమిళపడం 2' రూపొందుతోంది. ఈ చిత్రం రిలీజ్‌ అయ్యే దాకా కూడా వెయిట్‌ చేయకుండా భీమినేని ఈ చిత్రాన్ని తెలుగులో అల్లరినరేష్‌తో చేయడానికి నిర్ణయించి, నిర్మాతగా కూడా ఆ చిత్రం రీమేక్‌ రైట్స్‌ని ఫ్యాన్సీ రేటుకి కొనేశాడు. 

ఇక ఈమధ్య అల్లరోడు తాను ఇకపై స్పూఫ్‌లు, పేరడీలు చేయనని ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన మాట తప్పుతున్నట్లే కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో స్పూఫ్‌లే గాక ఏదైనా కొత్తదనం లేకపోతే మరలా పరిస్థితి మామూలే. కాగా ఇటీవల అల్లరోడు 'మేడ మీద అబ్బాయి' అనే రీమేక్‌ చేశాడు. అది డిజాస్టర్‌ అయింది. మరి ఈ 'సుడిగాడు 2' ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాల్సివుంది..!

Allari Naresh in Sudigali 2 Movie:

Allari Naresh and Bheemaneni Team-up Again
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs