Advertisement
Google Ads BL

'జూలీ 2' ని మోసం చేశారు


జూలీ 2 సినిమాతో బాలీవుడ్ లో పాగా వేయాలని  రాయ్ లక్ష్మి తెగ కలలు కంది. అసలు జూలీ 2 సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో రాయ్ లక్ష్మి ఎంతో బోల్డ్ గా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయింది. ఈ సినిమా కోసం రాయ్ లక్ష్మి ఎంతగా కష్టపడిందో.. ఎప్పటికప్పుడు అందరికి చెబుతూనే వుంది. అలాగే ఈ సినిమా  ప్రమోషన్స్ లోను రాయ్ లక్ష్మి చాలా ఉత్సాహంగా పాల్గొంది. ఎందుకంటే ఈ సినిమా మీద ఆమె గంపెడాశలు పెట్టుకుంది. ఈ సినిమాతో ఎలాగైనా బాలీవుడ్ లో పాగా వేయాలనుకుంది. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ సమస్యల వలన నవంబర్ 24 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

Advertisement
CJ Advs

సినిమా విడుదల ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చెయ్యడంలో చిత్ర బృందంతోపాటే... రాయ్ లక్ష్మి కూడా తనవంతు కృషి చేసింది. ఇక సినిమా విడుదలకు ముందు ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డామని.. ఈ రోజు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి మీ ముందుకొస్తున్నామని.. మమ్మల్ని ఆశీర్వదించమని మరీ ట్వీట్ చేసింది. అయితే ఈ శుక్రవారమే విడుదలైన ఈ సినిమా మొదటి షోకే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రాయ్ లక్ష్మి హాట్ సీన్స్ మీద పెట్టిన ఫోకస్ సినిమా కథ విషయంలో అస్సలు పెట్టలేదని విషయం అర్ధమవుతుంది. కేవలం ట్రైలర్, టీజర్, ప్రోమో సాంగ్స్ లో చూపించిన విధంగా రాయ్ లక్ష్మి హాట్  షో సినిమాలో మాత్రం సరిగ్గా లేదు. 

సినిమాలో ఆ బోల్డ్ సీన్స్ అన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. ఇక మిగతా సినిమా అంతా అనేక సినిమాల్లో అంటే.. విద్యాబాలన్ డర్టీ పిక్చర్,  కరీనా కపూర్ హీరోయిన్ సినిమా నుండి కాపీ కొట్టినట్లుగా అనిపిస్తుంది. ఇకపోతే రాయ్ లక్ష్మి ఎన్నో అసలు పెట్టుకున్న ఈ జూలీ 2 కి క్రిటిక్స్ కేవలం 1 రేటింగ్ ఇచ్చారంటేనే సినిమా పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతుంది. మరి ఈ రేటింగ్స్ చూసిన రాయ్ లక్ష్మి నోట మాటపడిపోయిందేమో కూడా. ఎందుకంటే.. ఏ ఈసినిమాతో రాయ్ లక్ష్మి బాలీవుడ్ ఆశలు గల్లంతైనట్లే.

Julie 2 got Negative talk at Box Office:

Raai Laxmi Disappaonted with Julie 2 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs